Virat Kohli : ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు ఆరు వికెట్ల తేడాతో దారుణమైన ఓటమిని మూట కట్టుకున్న సంగతి తెలిసిందే. ఎప్పుడైతే ఈ ఓటమి ఎదురైందో.. అప్పటినుంచి బెంగళూరు ప్లేయర్లను సోషల్ మీడియాలో అభిమానులు ఒక ఆట ఆడుకుంటున్నారు. ముఖ్యంగా సాల్ట్ రన్ అవుట్ కు కారణం విరాట్ కోహ్లీ అని మండిపడుతున్నారు. విరాట్ కోహ్లీ తన వికెట్ కాపాడుకునేందుకు ప్రయత్నించాడని.. కానీ అతడు కూడా ఆడలేకపోయాడని వ్యాఖ్యానిస్తున్నారు. విరాట్ కోహ్లీ గనక గట్టిగా నిలబడి ఇన్నింగ్స్ ఆడి ఉంటే.. బెంగళూరు జట్టు మరిన్ని పరుగులు చేసి ఉండేదని.. అప్పుడు ఢిల్లీ జట్టుపై ఒత్తిడి ఉండేదని.. అంతిమంగా విజయం బెంగళూరు జట్టుకు లభించి ఉండేదని.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఓటమి ద్వారా బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దిగజారాల్సి వచ్చిందని.. మొదట్లో నాలుగు వికెట్లు తీసిన బెంగళూరు బౌలర్లు.. ఆ తర్వాత చేతులెత్తేసారని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు మండిపడుతున్నారు.
Also Read : మైదానంలో కేఎల్ రాహుల్ ‘కాంతారా’ స్టెప్.. అందుకే అలా చేశాడట!
దుఃఖం బాధలో..
ఇక ఈ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ విషాదం లో మునిగిపోయాడు. సాధారణంగా ప్రత్యర్థి జట్టు గెలిచినప్పుడు.. మైదానంలో హుందాగా ప్రవర్తించే విరాట్ కోహ్లీ.. ఎందుకనో ఢిల్లీ జట్టు గెలిచిన తర్వాత అలా ఉండలేకపోయాడు. ముక్తసరిగా కె.ఎల్ రాహుల్ ను అభినందించిన విరాట్ కోహ్లీ.. విచార వదనంతో డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఒక్కడే కూర్చుని విచారంలో మునిగిపోయాడు. విరాట్ కోహ్లీ మాత్రమే కాదు.. రాయల్ చాలెంజర్స్ జట్టులోని మిగతా ఆటగాళ్లు కూడా అలానే ఉన్నారు. ఈ మ్యాచ్లో విఫలమైన దేవదత్ పడిక్కల్, లివింగ్ స్టోన్ వంటి ఆటగాళ్లు కూడా బాధలో కనిపించారు.. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో తెగ కనిపిస్తున్నాయి.. అయితే ఇతర మైదానాలపై దూకుడుగా ఆడుతూ.. విజయాలు సాధిస్తున్న బెంగళూరు జట్టు.. సొంత మైదానంలో మాత్రం తేలిపోతుంది. అంతేకాదు బెంగళూరు వేదికగా 40 ఓటములు ఎదుర్కొని.. సొంత మైదానంలో అత్యధిక సార్లు పరాజయాలు చవిచూసిన జట్టుగా చెత్త రికార్డును తన పేరు మీద లిఖించుకుంది. బెంగళూరు తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సొంత సొంత మైదానాలలో ఓడిపోయిన జట్టుగా తర్వాతి స్థానాలలో కొనసాగుతున్నాయి. విరాట్ కోహ్లీ గత మ్యాచ్లో బాగానే ఆడినప్పటికీ.. ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో మాత్రం భారీ స్కోర్ చేయలేకపోయాడు. అది జట్టు మీద తీవ్రంగా ప్రభావం చూపించిందని క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు
Also Read : సొంత మైదానంలో..RCB చెత్త రికార్డు