Virat Kohli : ఆ మధ్య తెలుగులో అర్జున్ రెడ్డి పేరుతో ఓ సినిమా విడుదలైంది. అందులో బూతు పదాలకు కొదవలేదు. ఇక ఆగ్రహంతో కూడిన సన్నివేశాలకు లెక్కే లేదు. అందుకే ఆ సినిమా యువతరానికి విపరీతంగా నచ్చింది. విజయ్ దేవరకొండ కెరియర్లో అద్భుతమైన విధంగా ఆ సినిమా నిలిచింది. ఆ సినిమాపై అప్పట్లో రాజకీయంగా కూడా దుమారం చెలరేగింది. కాంగ్రెస్ నాయకుడు వి హనుమంతరావు ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని కూడా కోరారు. అర్జున్ రెడ్డి సినిమాలో అమిత్ అంటూ విజయ్ దేవరకొండ పలికిన డైలాగులు అప్పట్లో పెను సంచలనం సృష్టించాయి. థియేటర్లలో ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించాయి. అయితే ఎప్పుడో విడుదలైన అర్జున్ రెడ్డి సినిమాకు సంబంధించిన విషయం ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే.. దానికో కారణం ఉంది. ఆ కారణం పేరు విరాట్ కోహ్లీ.
Also Read : బయట పులులు.. ఇంట్లో పిల్లులు.. ఐపీఎల్ చరిత్రలో బెంగళూరు అత్యంత చెత్త రికార్డు
అసభ్యకరమైన ప్రవర్తన
విరాట్ కోహ్లీ మైదానంలో దూకుడుగా ఉంటాడు. అప్పుడప్పుడు చిలిపిగా కూడా వ్యవహరిస్తుంటాడు. తోటి ఆటగాళ్లతో సరదాగా సంభాషిస్తుంటాడు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో కూడా ఆనందంగా ఉంటాడు. అయితే అలాంటి విరాట్ కోహ్లీ పంజాబ్ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ప్రవర్తించిన తీరు చర్చకు దారి తీస్తోంది. అసభ్యకరమైన రీతిలో విరాట్ కోహ్లీ సంబరాలు జరుపుకున్న తీరు వివాదాస్పదంగా మారింది.. ఈ మ్యాచ్లో ముందుగా పంజాబ్ జట్టు బ్యాటింగ్ చేసింది. ప్రారంభం నుంచి తడబడితే వాడింది. తక్కువ పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.. 42 పరుగుల వద్ద ప్రియాన్ష్ ఆర్య రూపంలో పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. 62 పరుగుల వద్ద ప్రభ్ సిమ్రాన్ సింగ్, 68 పరుగుల వద్ద శ్రేయస్ అయ్యర్, 70 పరుగుల వద్ద నేహల్ వదేరా క్రికెట్లను కోల్పోయింది. ఇందులో నేహల్ వదేరా అనవసరమైన పరుగు కోసం ప్రయత్నించి రన్ అవుట్ అయ్యాడు.. విరాట్ కోహ్లీ, టిమ్ డేవిడ్ అతని అవుట్లో ముఖ్యపాత్ర పోషించారు. వదేరా అవుట్ అవ్వగానే విరాట్ కోహ్లీ తన సహజ శైలికి భిన్నంగా ప్రవర్తించాడు.. పిచ్చిపిచ్చిగా రియాక్షన్ ఇచ్చాడు.. అసభ్యకరమైన రీతిగా సంబరాలు జరుపుకున్నాడు.. రాయడానికి వీలు లేకుండా అసభ్యకరమైన సంజ్ఞలు చేశాడు.. ఇది చూసిన అభిమానులు విరాట్ కోహ్లీ మైదానంలో అర్జున్ రెడ్డి సినిమాను చూపించాడని వ్యాఖ్యానిస్తున్నారు.” విరాట్ కోహ్లీ దూకుడు గాడు అని తెలుసు. మైదానంలో రెచ్చిపోతాడని కూడా తెలుసు. కానీ ఈ స్థాయిలో దారుణమైన సంకేతాలు ఇస్తాడని.. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడని అస్సలు అనుకోలేదు. నేహల్ వదేరా అవుట్ అయినంత మాత్రాన విరాట్ కోహ్లీ ఇలా వ్యవహరించడం సరికాదు. ఇలా ప్రవర్తిస్తే విరాట్ కోహ్లీ తన వ్యక్తిత్వాన్ని మరింత దిగజార్చుకోవాల్సి వస్తుందని” నెటిజన్లు అంటున్నారు.