RCB : బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓటమిపాలైంది. పంజాబ్ జట్టుతో జరిగిన ఈ మ్యాచ్లో బెంగళూరు టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసింది. వర్షం కురవడం వల్ల మ్యాచ్ నిర్వహణకు అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత వర్షం తగ్గడం.. డ్రైనేజీ నీటిని బయటికి పంపించడంతో ఔట్ ఫీల్డ్ ఆరిపోయింది. దీంతో అంపైర్లు మ్యాచ్ నిర్వహణకు మొగ్గు చూపించారు. ఫలితంగా 14 ఓవర్లకు మ్యాచ్ ను కుదించారు. టాస్ ఓడిపోవడంతో బెంగళూరు ముందుగా బ్యాటింగ్ కు వచ్చింది. వర్షం కురవడం.. బంతి స్వింగ్ అవుతుండడంతో.. పంజాబ్ జట్టు బౌలర్లు పండగ చేసుకున్నారు. పంజాబ్ బౌలర్ల ధాటికి బెంగళూరు ప్లేయర్లు విఫలమయ్యారు. విరాట్ కోహ్లీ ఒక పరుగు, సాల్ట్, లివింగ్ స్టోన్ చెరి నాలుగు పరుగులకు, జితేష్ శర్మ రెండు పరుగులకు, కృణాల్ పాండ్యా ఒక్క పరుగు చేసి అవుట్ అయ్యారు.. అర్ష్ దీప్ సింగ్ , జాన్సన్, చాహల్, హర్ ప్రీత్ బ్రార్ తలా రెండు వికెట్లు సాధించారు. బార్ట్ లెట్ ఒక వికెట్ నేల కూల్చాడు. ఇక బెంగళూరు జట్టులో టిమ్ డేవిడ్ (50*) విధ్వంసం సృష్టించాడు..రజత్ పాటిదార్(23) తన వంతుగా బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత 96 పరుగుల విజయ లక్ష్యంతో రంగంలోకి దిగిన పంజాబ్ జట్టు 5 వికెట్లు కోల్పోయి చేదించింది. పంజాబ్ జట్టులో నెహల్ వదేరా(33*) టాప్ స్కోరర్ గా నిలిచాడు. శశాంక్ సింగ్ (1), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (7) విఫలమయ్యారు. ప్రియాన్ష్ ఆర్య(16), ప్రభ్ సిమ్రాన్ సింగ్(13) వేగంగా ఆడే క్రమంలో అవుట్ అయ్యారు. హేజిల్ వుడ్ మూడు వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు సాధించాడు.
Also Read : ఎవరు బ్రో నువ్వు.. విరాట్ కోహ్లీనే పారిపోయేలా చేశావు
బెంగళూరు చెత్త రికార్డు
పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు 5 వికెట్ల తేడాతో తలవంచింది. తద్వారా అత్యంత చెత్త రికార్డులు నమోదు చేసింది.. బెంగళూరు వేదికపై 46 మ్యాచ్ లలో పరాజయాలు సొంతం చేసుకుంది. తద్వారా సొంతవేదికపై అత్యధిక ఓటములు దక్కించుకున్న జట్టుగా బెంగళూరు చెత్త రికార్డు నమోదు చేసింది. అరుణ్ జెట్లీ మైదానంలో ఢిల్లీ 45, ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కతా నైట్ రైడర్స్ 38, వాంఖడే లో ముంబై 34, మొహాలిలో 30 మ్యాచ్లలో ఓడిపోయి పంజాబ్.. బెంగళూరు తర్వాత స్థానాలలో ఉన్నాయి. ఈ సీజన్లో సొంత మైదానంలో గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. జడ్జెట్టు చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక కోల్ కతా నైట్ రైడర్స్ పై 7 వికెట్లు, చెన్నై జట్టుపై 50 పరుగులు, ముంబై ఇండియన్స్ పై 12 పరుగులు, రాజస్థాన్ రాయల్స్ పై 9 వికెట్ల తేడాతో విజయాలు సాధించింది.
Also Read : గ్రీన్ కలర్ జెర్సీ లో బెంగళూరుకు తిరుగులేదంతే.. ఎన్ని విజయాలు సాధించిందంటే..