Virat Kohli : విరాట్ కోహ్లీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సుదీర్ఘకాలంగా ఐపీఎల్ ఆడుతున్నాడు. కొన్నిసార్లు కెప్టెన్ గా.. మరికొన్నిసార్లు కీలక ఆటగాడిగా బెంగళూరు జట్టుకు సేవలందించాడు. ఇప్పటికీ సేవలు అందిస్తూనే ఉన్నాడు. వాస్తవానికి కోహ్లీ పుట్టింది ఢిల్లీలో అయినప్పటికీ.. బెంగళూరు జట్టుతో.. బెంగళూరు నగరం తో విరాట్ కోహ్లీకి అవినాభావ సంబంధం ఉంది. విరాట్ కోహ్లీని బెంగళూరు వాసులు తమ కన్నడ వాడిగానే చూస్తారు. కోహ్లీ కూడా కొన్ని కన్నడ పదాలు మాట్లాడి కర్ణాటక వాసులను ఆనందానికి గురిచేస్తాడు. అందువల్లే విరాట్ కోహ్లీ అంటే చాలామంది ఇష్టపడుతుంటారు. విపరీతంగా ఆరాధిస్తుంటారు. 2008 నుంచి గత సీజన్ వరకు బెంగళూరు ఒక ట్రోఫీ కూడా గెలుచుకోలేకపోయినప్పటికీ.. ఈ స్థాయిలో అభిమానుల ఆదరణ ఉందంటే అందుకు ప్రధాన కారణం విరాట్ కోహ్లీ అనడంలో ఎటువంటి సందేహం లేదు. దూకుడుకు మారుపేరుగా.. ఎదురుదాడికి సిసలైన పేరుగా విరాట్ కోహ్లీ కనిపిస్తాడు. అందువల్లే అతడు ప్రతి కన్నడ అభిమాని హృదయంలో దర్శనమిస్తాడు.
Also Read : RCB జెర్సీ గ్రీన్ కలర్ లోకి.. కారణమిదే..
సింహం లాగా..
రాజస్థాన్ రాష్ట్రంలో సింహాలు ఎక్కువగా ఉంటాయి.. పేరుకు ఎడారి రాష్ట్రమైనప్పటికీ.. ఇక్కడ అడవులకు కొదవలేదు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం కావడంతో ఇక్కడ విస్తీర్ణపరంగా అడవులు చాలా ఎక్కువనే ఉంటాయి. అందులో సింహాలు విస్తృతంగా కనిపిస్తుంటాయి. అందువల్లే రాజస్థాన్ రాష్ట్ర ప్రజలు తమ రాజసానికి గుర్తుగా సింహాన్ని చూపిస్తుంటారు. ఇక ఆదివారం రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జైపూర్ వేదికగా బెంగళూరు జట్టు తలపడుతోంది. సాయంత్రం ఈ మ్యాచ్ మొదలవుతుంది. అయితే ఈ మ్యాచ్ లో గెలవడానికి ఇరుజట్లు శాయ శక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఇక ఇటీవల బెంగళూరు జట్టు ఢిల్లీ చేతిలో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా గెలవాలని భావిస్తుంది. అటు రాజస్థాన్ కూడా సొంత మైదానంలో అదరగొట్టాలని యోచిస్తోంది.. మొత్తంగా చూస్తే రెండు జట్ల మధ్య హోరాహోరీ తప్పదు. అయితే విజయం కోసం బెంగళూరు జట్టు ఆటగాళ్లు విపరీతంగా శ్రమించారు. ముఖ్యంగా బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ తీవ్రంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. జైపూర్ మైదానంలో విరాట్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా.. బెంగళూరు జట్టు ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీశాడు. ఆ ఫోటోలలో అచ్చం సింహంలాగే విరాట్ కోహ్లీ ఉన్నాడని అతని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. సింహం లాంటి రాజసాన్ని విరాట్ ప్రదర్శిస్తున్నాడని వారు పేర్కొంటున్నారు. ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో దూకుడుగా ఆడే క్రమంలో పెవ్లిఈయన్ చేరుకున్న విరాట్.. ఈ మ్యాచ్లో మాత్రం అదరగొట్టాలని బెంగళూరు అభిమానులు కోరుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా విరాట్ కోహ్లీని ట్యాగ్ చేస్తూ సందేశాలను పంపిస్తున్నారు. రాజస్థాన్ పై గెలవాలని.. ప్లే ఆఫ్ ఆశలను బలంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నారు.
THE AT JAIPUR…!!!! pic.twitter.com/sdgMPESdaZ
— Johns. (@CricCrazyJohns) April 13, 2025