RCB : పది జట్లు కూడా విభిన్నమైన జెర్సీలను ధరిస్తాయి. అ జెర్సీలలో బ్రాండ్ ప్రమోషన్ లు ఉంటాయి. జియో నుంచి మొదలు పెడితే అరుణ్ ఐస్క్రీం వరకు.. కార్పొరేట్ కంపెనీల పేర్లు ఆయా జట్లకు సంబంధించిన జెర్సీలలో దర్శనమిస్తుంటాయి. ఈ బ్రాండ్ ప్రమోషన్ చేసినందుకు కంపెనీలు జట్ల యాజమాన్యాలకు డబ్బులు ఇస్తుంటాయి. ఇవి కోట్లల్లలోనే ఉంటాయి. ఐపీఎల్ లో మ్యాచ్ టికెట్లు, యాడ్స్ మాత్రమే కాకుండా జెర్సీలపై బ్రాండ్ ప్రమోషన్లు కూడా ఆయా జట్ల యాజమాన్యాలకు కాసులు కురిపిస్తుంటాయి.. బ్రాండ్ ప్రమోషన్ లో ఒక్కో జట్టు ఒక్కో తీరైన విధానాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది.. అంతిమంగా కార్పొరేట్ కంపెనీలు కోరుకున్నట్టుగానే జెర్సీ డిజైన్ ఉంటుంది.
Also Read : గెలికిన కోహ్లీకి.. గెలిపించి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన రాహుల్.. వీడియో
గ్రీన్ కలర్ లోకి
ఐపీఎల్ కాసుల క్రీడ మాత్రమే కాదు.. ఇందులోనూ సామాజిక స్పృహ ఉంటుంది.. ఇప్పటికే కొన్ని జట్లు డాట్ బాల్స్ కు తగ్గట్టుగా మొక్కలు నాటుతున్నాయి.. ఈ విషయంలో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు గత ఏడాది తమ సాధించిన పరుగులకు తగ్గట్టుగా ఆయా గ్రామాలలో పేద ప్రజలకు సోలార్ దీపాలు అందించింది.. ఇప్పుడిక బెంగళూరు జట్టు పర్యావరణానికి తనవంతుగా సహకారం అందిస్తోంది. ఇందులో భాగంగా మరికొద్ది క్షణాల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సరికొత్త జెర్సీతో కనిపించింది.. అ జెర్సీ గ్రీన్ కలర్ లో ఉంది. జెర్సీలో ఆకుపచ్చని మొక్కలు.. ప్లానెట్.. జంతువులు కనిపించాయి. ఇవన్నీ కూడా 3d ఆర్ట్ లో దర్శనమిచ్చాయి. అయితే ఆకస్మాత్తుగా బెంగళూరు జట్టు ఇలా గ్రీన్ కలర్ జెర్సీలో కనిపించడానికి ప్రధాన కారణం.. పర్యావరణ స్పృహ. 2011 నుంచి ప్రతి ఏడాది ఐపీఎల్ సీజన్లో ఒక మ్యాచ్ లో బెంగళూరు జట్టు ఇలా గ్రీన్ కలర్ జెర్సీ వేసుకుని కనిపిస్తుంది.. దీని ద్వారా పర్యావరణ స్పృహను పెంపొందిస్తుంది. దీనివల్ల ప్రజల్లో పర్యావరణం పై స్పృహ పెరుగుతుందని.. మొక్కలు, ఇతర జంతువుల సంరక్షణకు ఇది తోడ్పడుతుందని బెంగళూరు జట్టు యాజమాన్యం భావిస్తూ ఉంటుంది..” బెంగళూరు యాజమాన్యం ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. నాటుతూనే ఉన్నారు. ఐపీఎల్ అనేది కాసుల క్రీడ మాత్రమే కాకుండా.. పర్యావరణానికి మంచి కలిగించే ఇటువంటి కార్యక్రమాలను చేపట్టడం గొప్ప విషయం. దీనివల్ల చాలామందిలో పర్యావరణ స్పృహ పెరుగుతుంది. తద్వారా ప్రకృతికి ఎంత కొంత మేలు చేకూరుతుందని” నెటిజన్లు పేర్కొంటున్నారు. మరోవైపు బెంగళూరు జట్టు ఇప్పటికే పర్యావరణ స్పృహ కలిగించే అనేక కార్యక్రమాలను చేపట్టింది. పలు ప్రాంతాలలో మొక్కలు నాటింది. విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచే కార్యక్రమలను చేపట్టింది. అందువల్లే బెంగళూరు జట్టు యాజమాన్యం తమ ఆటగాళ్లకు ప్రతి ఏడాది ఒక మ్యాచ్లో గ్రీన్ కలర్ జెర్సీ ధరించేలా చేస్తుంది
Also Read : సొంత మైదానంలో..RCB చెత్త రికార్డు