Virat Kohli : జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి అరవింద సమేత వీర రాఘవ సినిమాలో జగపతిబాబు పలికిన డైలాగులు.. సోమవారం ముంబై జట్టుపై బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ ఆడిన ఆటకు అచ్చు గుద్దినట్టు సరిపోతాయి. తనను పరుగుల యంత్రం అని ఎందుకు పిలుస్తారో.. GOAT అని ఎందుకు అంటారో.. విరాట్ కోహ్లీ చూపించాడు. బంతిని కళాత్మకంగా కొట్టాడు. గట్టిగా కొట్టాడు.. కసి తీరా కొట్టాడు.. మొత్తంగా దీర్ఘకాలం శత్రుత్వం ఉన్నట్టు.. బంతితో పగ ఉన్నట్టు.. పిచ్చికొట్టుడు కొట్టాడు. అతడు కొడుతున్న స్టైల్ చూస్తే.. బ్యాట్ అతడి చేతికి మొలచినట్టు కనిపించింది. ఇలా రాయడంలో అతిశయోక్తి లేదు.. ఆశ్చర్యార్థకం అంతకన్నా లేదు. సుదీర్ఘ విరామం తర్వాత ముంబై జట్టు తరఫున ఆడుతున్న బుమ్రాకు విరాట్ కోహ్లీ చుక్కలు చూపించాడు. బుమ్రా వేసిన బంతిని గట్టిగా కొడితే స్టాండ్స్ లో పడింది. అసలు ఈ షాట్ మ్యాచ్ మొత్తానికే హైలెట్. 42 బంతుల్లో 8 ఫోర్లు, రెండు సిక్సర్లతో 67 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ. రెండవ వికెట్ కు దేవదత్ పడికల్ తో 91, రజత్ పాటిదార్ తో మూడో వికెట్ కు 48 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పి విరాట్ అదరగొట్టాడు. అతడు దూకుడు వల్ల బెంగళూరు జట్టు స్కోర్ రాకెట్ వేగంతో దూసుకుపోయింది.
Also Read : విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర.. టీమిండియా నుంచి ఒకే ఒక్కడు..
ఎంతమంది బౌలర్లను మార్చినా
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న హార్దిక్ పాండ్యా.. తప్పుడు నిర్ణయం తీసుకున్నాడా అని అందరూ అనుకున్నారు.. కానీ తొలి ఓవర్ లోనే వికెట్ పడగొట్టి అతడి నిర్ణయం సరైనదేనని బౌల్ట్ నిరూపించాడు. కానీ మరో ఎండ్ లో విరాట్ కోహ్లీ ఉన్న విషయాన్ని ముంబై ఆటగాళ్లు విస్మరించారు. చిరుత వేగంతో బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ.. పవర్ ప్లే లో బెంగళూరు జట్టుకు 73 పరుగులు లభించేలా చేశాడు. ఇందులో పడికల్ కు వాటా ఉన్నప్పటికీ.. సింహభాగం విరాట్ కోహ్లీ. ఇక ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. టి20 ఫార్మాట్ లో 13వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. 386 ఇన్నింగ్స్ లలో అతడు ఈ ఘనత సాధించాడు. టీం ఇండియా తరఫున ఈ రికార్డు సృష్టించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ గుర్తింపు పొందాడు. ఇక ఓపెనర్ గా మైదానంలోకి విరాట్ కోహ్లీ ప్రవేశిస్తున్నప్పుడు.. మైదానం మొత్తం కోహ్లీ నామస్మరణతో ఊగిపోయింది. ఒక ముక్కలో చెప్పాలంటే ఆడుతోంది బెంగళూరు లోనా అనే భ్రమ కలిగించింది. ఎందుకంటే అక్కడున్నది విరాట్ కోహ్లీ కాబట్టి..
WHAT A SIX BY VIRAT KOHLI AGAINST JASPRIT BUMRAH. pic.twitter.com/KSpXjQsSqE
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 7, 2025