Virat Kohli : విరాట్ కోహ్లీ ప్రస్తా ఐపీఎల్లో దుమ్ము రేపుతున్నాడు. బెంగళూరు జట్టు తరుపున పరుగుల వరద పారిస్తున్నాడు. వేదికతో సంబంధం లేకుండా.. ప్రత్యర్థి జట్టుతో సంబంధం లేకుండా వీరవిహార చేస్తున్నాడు. బ్యాట్ తో బంతిని మైదానం నలుమూలల పరుగులు పెట్టిస్తున్నాడు. అందువల్లే విరాట్ కోహ్లీ ప్రత్యర్థి జట్ల బౌలర్లకు సింహ స్వప్నం లాగా నిలిచాడు. ఇక ప్రస్తుత ఐపీఎల్లో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సృష్టించాడు. ద్వారా ఏ ఆటగాడికీ సాధ్యం కాని రికార్డును అతడు సొంతం చేసుకున్నాడు.
Also Read : గేల్, విరాట్ కాదు.. రోమారియో షెఫర్డే బెంగళూరు బీస్ట్..
గేల్ రికార్డు బద్దలు కొట్టాడు
ఐపీఎల్ లో మాత్రమే కాదు.. టి20 ఫార్మాట్ లో క్రిస్ గేల్ సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కావు. యూనివర్సల్ బాస్ అని పిలుస్తుంటారు. టి20 ఫార్మాట్ క్రికెట్ ఆడినన్ని రోజులు గేల్ వీర విహారం చేశాడు. తనదైన రోజు మాత్రమే కాదు, తనది కాని రోజు కూడా గేల్ మైదానంలో విలయం సృష్టించేవాడు. అయితే అంతటి గేల్ రికార్డును కూడా విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు. శనివారం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో విరాట్ కోహ్లీ అరుదైన మైలురాయి అందుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న టి20 లీగ్స్ లలో ఒక ఫ్రాంచైజీ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) తరఫున 300 సిక్సులు కొట్టిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ ఘనత అందుకున్న తొలి బ్యాటర్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు.. అంతే కాదు ఒకే మైదానంలో (చిన్నస్వామి స్టేడియంలో) అత్యధిక సిక్సర్లు (152) కొట్టిన బ్యాటర్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు. అంతేకాదు ఈ జాబితాలో తనకంటే ముందు ఉన్న గేల్ (151) ను విరాట్ కోహ్లీ వెనక్కి నెట్టాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ 33 బంతుల్లో.. ఐదు ఫోర్లు, అదే స్థాయిలో సిక్సర్లు కొట్టి 62 పరుగులు చేశాడు.. ఇక బెంగళూరు జట్టు చెన్నై పై ఐదు వికెట్లు లాస్ అయ్యి 213 రన్స్ చేసింది. బెంగళూరు జట్టులో లో వచ్చిన రోమారియో షెఫర్డ్ 14 బంతుల్లోనే 53 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో నాలుగు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. విరాట్ బ్యాటింగ్ కు దిగడమే ఆలస్యం.. ఎదురుదాడి మొదలు పెట్టాడు. చెన్నై బౌలర్లను ఉతికి ఆరేశాడు. ఏమాత్రం భయపడకుండా.. వెనకడుగు వేయకుండా.. బంతి పడటమే ఆలస్యం కసి కొద్ది కొట్టాడు. బలంకొద్ది బాదాడు. అందువల్లే అతడు ఆ స్థాయిలో పరుగులు చేయగలిగాడు. బెంగళూరు ఇన్నింగ్స్ కు మూల స్తంభం లాగా నిలిచాడు.. మొత్తానికి తనకు తానే సాటి అని మరొకసారి విరాట్ కోహ్లీ నిరూపించుకున్నాడు.
Also Read : చివరి రెండు ఓవర్లలో.. ఇంత విధ్వంసమా.. చెన్నై బౌలర్లకు ఏడుపొకటే తక్కువ!