Virat Kohli : పై ఉపోద్ఘాతంలో పదాలు మారుతున్నాయి. కానీ కొట్టడం మాత్రం అలాగే ఉంటుంది. ఆ కొట్టడంలో అతడు పీహెచ్ డీ చేశాడు. అందువల్లే 36 ఏళ్ల వయసు కూడా అతడికి జస్ట్ నెంబర్ లాగే ఉంది. ఆ ఉత్సాహం.. ఆ ఉద్రేకం.. ఆ వేడి అలాగే ఉంది. అది మరింతగా పెరుగుతోంది. అందువల్లే అతడు నవ యువకుడి లాగా ఆడుతున్నాడు. మైదానంలో బీస్ట్ మాదిరి రెచ్చిపోతున్నాడు. మచ్చల పులి ముఖం మీద పంజా దెబ్బ కొట్టినట్టు.. మండు వేసంగిలో ఇసుక తుఫాన్ కమ్మేసినట్టు.. మైదానంలో వీర విహార చేస్తున్నాడు. బౌలర్ తో సంబంధం లేదు. ప్రత్యర్థి జట్టుతో సంబంధం లేదు. పిచ్ ఎలాంటిదైనా అవసరం లేదు. అతడు మాత్రం కొడుతూనే ఉన్నాడు. కొడుతూనే ఉంటాడేమో.. అతనితో క్రికెట్ మొదలుపెట్టిన వారు ఇప్పటికే రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. కొంతమంది రేపో మాపో రిటైర్మెంట్ ప్రకటించాలని అనుకుంటున్నారు. కానీ అతను మాత్రం రెట్టించిన ఉత్సాహంతో బ్యాటింగ్ చేస్తున్నాడు. తన పేరు విరాట్ కోహ్లీ కాదని.. క్రికెట్లో తను ఒక బ్రాండ్ అని నిరూపించుకుంటున్నాడు..
Also Read : గేల్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా ఘనత..
ఐపీఎల్ లో అనితర సాధ్యమైన చరిత్ర
ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ ఏటికేడు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. మనకు మాత్రమే సాధ్యమైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. 2011 ఐపిఎల్ లో విరాట్ కోహ్లీ 557 పరుగులు చేశాడు. 2013లో ఏకంగా 634 పరుగులు చేశాడు. 2015 లో 505 పరుగులు చేశాడు. 2016 ఐపీఎల్ అయితే.. విరాట్ నామ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనుకోవచ్చు . ఆ సీజన్లో ఏకంగా 973 పరుగులు చేశాడు 2018లో 530 పరుగులు చేశాడు . ఇక 2023లో 639 పరుగులు చేశాడు 2024లో 741 రన్స్ చేశాడు. 2025లో ఇప్పటివరకు 505* పరుగులు చేశాడు. అయితే ఈ సీజన్లో రెట్టించిన ఉత్సాహంతో బ్యాటింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ.. ఎంత లేదనుకున్నా మరో 200 పరుగులకు మించి స్కోర్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ విరాట్ కోహ్లీ అన్ని పరుగులు గనుక చేస్తే.. ఐపీఎల్ చరిత్రలో బీస్ట్ మోడ్ క్రికెట్ ఆడిన తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచిపోతాడు. ఇక ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి సెంచరీ నమోదు కాకపోయినప్పటికీ.. హాప్ సెంచరీలు మాత్రం వస్తూనే ఉన్నాయి. పరుగుల వరద పారుతూనే ఉంది. భయం అనే విషయాన్ని విరాట్ కోహ్లీ పక్కన పెట్టాడు. బెదురు అనే పదాన్ని దగ్గర్లో కూడా రానివ్వడం లేదు. వణుకు అనే విషయాన్ని కిలోమీటర్ల దూరంలోనే పాతిపెట్టాడు. మొత్తంగా చూస్తే ఏమాత్రం కనికరం లేకుండాబౌలర్ల పై విరుచుకుపడుతున్నాడు. దూకుడు తో పరుగుల సునామీని మైదానాలలో సృష్టిస్తున్నాడు.
Also Read : చివరి రెండు ఓవర్లలో.. ఇంత విధ్వంసమా.. చెన్నై బౌలర్లకు ఏడుపొకటే తక్కువ!