https://oktelugu.com/

Virat Kohli: లక్షల మంది ముందు కాళ్లు మొక్కేశాడు.. విరాట్‌ కోహ్లీ గొప్పతనం ఇదే! 

Virat Kohli: టీమిండియా రన్‌ మెషిన్‌ విరాట్‌ కోహ్లీ పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. ఐపీఎల్‌లో పరుగులు వర్షం కురిపిస్తున్న విరాట్‌ తన అగ్రెసివ్‌తోనూ వార్తల్లో నిలుస్తున్నాడు. ముఖ్యంగా గౌతమ్‌ గంభీర్, నవీన్‌ ఉల్‌ హక్‌ల గొడవలతో కోహ్లీలోని దందుడకుతనం మరోసారి నిరూపితమైంది. అయితే తనలో అగ్రెసివ్‌ నెస్‌ మాత్రమే కాదు.. మంచి మనసు కూడా దాగుందని కింగ్‌ కోహ్లీ రుజువు చేశాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌ ప్రారంభానికి ముందు కోహ్లి తన చిన్ననాటి కోచ్‌ రాజ్‌కుమార్‌శర్మను […]

Written By: , Updated On : May 7, 2023 / 11:06 AM IST
Follow us on

Virat Kohli: టీమిండియా రన్‌ మెషిన్‌ విరాట్‌ కోహ్లీ పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. ఐపీఎల్‌లో పరుగులు వర్షం కురిపిస్తున్న విరాట్‌ తన అగ్రెసివ్‌తోనూ వార్తల్లో నిలుస్తున్నాడు. ముఖ్యంగా గౌతమ్‌ గంభీర్, నవీన్‌ ఉల్‌ హక్‌ల గొడవలతో కోహ్లీలోని దందుడకుతనం మరోసారి నిరూపితమైంది. అయితే తనలో అగ్రెసివ్‌ నెస్‌ మాత్రమే కాదు.. మంచి మనసు కూడా దాగుందని కింగ్‌ కోహ్లీ రుజువు చేశాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌ ప్రారంభానికి ముందు కోహ్లి తన చిన్ననాటి కోచ్‌ రాజ్‌కుమార్‌శర్మను కలుసుకున్నాడు విరాట్‌. తన క్రికెట్‌ కెరీర్‌కు పునాది వేసిన ఆయన కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఈ అరుదైన సన్నివేశానికి అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదిక అయింది. రాజ్‌కుమార్‌ శర్మ మైదానంలోకి రాగానే ప్రాక్టీసును సైతం ఆపేసి మరీ గురువ దగ్గరకు వచ్చాడు కింగ్‌. ఎంతో వినయంగా ఆయన పాదాలకు నమస్కరించాడు. కోహ్లీ విధేయత పట్ల సంతోషించిన కోచ్‌ విరాట్‌ వీపు తట్టి దీవెనలు అందించాడు. ఆపై ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. వీరిద్దరూ చాట్‌లో నిమగ్నమయ్యారు. కోహ్లీ కూడా అతని పేరు మీద ఉన్న స్టేడియంలో స్టాండ్‌ వైపు చూపించాడు.

కోహ్లీకి ఆట నేర్పిన రాజ్‌కుమార్‌.. 
రాజ్‌కుమార్‌ క్రికెటర్‌గా కోహ్లీకి చిన్నతనంలో కోచింగ్‌ ఇచ్చారు. ఆటలో మెలకువలు నేర్పించారు. క్రికెట్‌లో రాటుతేల్చాడు. నేడు కోహ్లి చరిత్రలో గొప్ప బ్యాటర్‌లలో ఒకరిగా పరిగణించడానికి రాజ్‌కుమార్‌ కూడా ఓ కారణం. ఇప్పటికీ రాజ్‌కుమార్‌ ఢిల్లీలోని తన అకాడమీలో యువకులకు కోచింగ్‌ను కొనసాగిస్తున్నాడు. తాజాగా ఐపీఎస్‌లో కూడా కొన్ని సూచనలు చేశాడు. 34 ఏళ్ల తన కెరీయర్‌లో రాజ్‌కుమార్‌ పాత్ర మరువలేనిదని కోహ్లీ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇంతలోనే తన చిన్ననాటి కోచ్‌ను కలిసే అవకాశం రావడంతో కోహ్లీ సంతోషంలో ముగినిగోపాడు. రాజ్‌కుమార్‌ ఆధ్వర్యంలోనే కోహ్లీ మొదట ఢిల్లీ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించడానికి, 2008 ప్రపంచ కప్‌లో అండర్‌–19 జట్టును విజయతీరాలకు చేర్చాడు. అదే సంవత్సరంలో, కోహ్లిని కూడా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు జట్టు ఎంపిక చేసింది.
గురువు ఆశీర్వావదంతో ఆఫ్‌ సెంచరీ.. 
ఢిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కోహ్లీ అర్ధసెంచరీతో రాణించాడు. కేవలం 46 బంతుల్లో 5 ఫోర్ల సహాయంతో 56 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇదే మ్యాచ్‌లో 12 పరుగుల స్కోరు వద్ద ఐపీఎల్‌లో ఏడువేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. గురువు ఆశీర్వాదం.. ఆయన సమక్షంలోనే అరుదైన ఏడు వేల పరుగుల మైలురాయిని అధిగమించడంతో కోహ్లీ సంతోషంగా కనిపించాడు.  దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా కోహ్లీకి తెలుసు’ అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.