IND Vs ENG: భారత స్టార్ క్రికెటర్ కింగ్ కోహీ.. కొన్ని నెలలుగా పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నారు. ఒకేరకమైన బంతికి ఔట్ అవుతూ తన బలహీనతను బయట పెట్టుకుంటున్నాడు. ఇటీవల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆడిన కోహ్లీ పేలవమైన ఆటతీరుతో విమర్శలు ఎదుర్కొన్నాడు. రెండు రోజుల క్రితం రంజీ మ్యాచ్‌లు కూడా ఆడాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ సిరీస్‌లో క్రికెట్ గాడ్ సచిన్ రికార్డు బద్ధలు కొట్టే అవకాశం కోహ్లికి ఉంది. 19 ఏళ్లుగా సచిన్ పేరిట ఉన్న రికార్డును కోహీ‍్ల బద్ధలు కొడతాడా లేదా అన్న ఉత్కఠ నెలకొంది. 36 ఏళ్ల ఈ బ్యాట్స్‌మన్ వన్డేలలో అత్యంత వేగంగా 14,000 పరుగుల మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది. ఫిబ్రవరి 2006లో దిగ్గజ సచిన్ టెండూల్కర్ పెషావర్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తన 350వ ODI ఇన్నింగ్స్‌లో 100 పరుగులు చేశాడు. అయితే భారతదేశం ఏడు పరుగుల తేడాతో ఓడిపోయింది. కోహ్లీ ప్రస్తుతం 283 వన్డే ఇన్నింగ్స్‌లలో 58.18 సగటు, 93.54 స్ట్రైక్-రేట్‌తో 13,906 పరుగులు సాధించాడు, 50 సెంచరీలు, 72 హాఫ్ సెంచరీలు చేశాడు. గత సంవత్సరం శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో, కోహ్లీ మూడు మ్యాచ్‌ల్లో 19.33 సగటుతో 58 పరుగులు మాత్రమే చేశాడు, 24, 14, 20 పరుగులు చేశాడు. నవంబర్ 19న ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత, కోహ్లీ కేవలం మూడు వన్డేలు మాత్రమే ఆడాడు.
ఫామ్‌లోకి రాని కింగ్..
కోహ్లీ ఇటీవల అత్యుత్తమ ఫామ్‌లో లేడు. తన లయను తిరిగి పొందడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన పెర్త్ టెస్ట్‌లో రెండో ఇన్నింగ్స్‌లో అతను సెంచరీ చేశాడు. కానీ ఇతర మ్యాచ్‌లలో పరుగుల కోసం ఇబ్బంది పడ్డాడు. 12 సంవత్సరాల తర్వాత రంజీ ట్రోఫీ పునరాగమనంలో కూడా అతను రెండంకెల స్కోరును చేరుకోలేకపోయాడు. రైల్వేస్‌కు చెందిన హిమాన్షు సంగ్వాన్ బౌలింగ్‌లో ఈజీగా అవుట్ అయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు తన అత్యుత్తమ ప్రదర్శనను తిరిగి పొందాల్సిన బాధ్యత ఇప్పుడు కోహ్లీపై ఉంది.
6 నుంచి వన్డే జిరీస్..
ఇక భారత పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ ఇప్పటికే టీ20 సిరీస్‌ను 4-1 తేడాలో కోల్పోయింది. వన్డే సిరీస్ గెలిచి పరువు నిలుపుకోవాలన్న కసితో జోస్ బట్లర్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ ఉంది. ఫిబ్రవరి 6 గురువారం నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ప్రారంభ మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. కటక్‌లోని బారాబతి స్టేడియం మరియు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం ఫిబ్రవరి 9 మరియు 12 తేదీలలో వరుసగా రెండవ మరియు మూడవ వన్డేలకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.