Sandeep Reddy Vanga and Naga Chaitanya : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకునే ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాల కోసం అహర్నిశలు ప్రయత్నం చేస్తూ సినిమాలను సక్సెస్ గా నిలుపడానికి వాళ్ళ వంతు కృషి అయితే చేస్తున్నారు… ఇక దర్శకులు సైతం కొత్త కథలతో సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉండటం విశేషం…
అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ ఒక బ్రాండ్ వాల్యూని క్రియేట్ చేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ బోల్డ్ కంటెంట్ తో సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను అందుకోవచ్చని నిరూపించిన ఏకైక వ్యక్తి కూడా సందీప్ రెడ్డి వంగనే కావడం విశేషం…ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధించడమే కాకుండా యూత్ లో మంచి ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాడు. మరి ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన అదృష్టమనే చెప్పాలి. మరి ఇప్పటివరకు ఆయన చేసిన మూడు సినిమాలు కూడా ఇండస్ట్రీలో రికార్డులను సృష్టిస్తూ ముందుకు సాగాయి. ముఖ్యంగా రణ్బీర్ కపూర్(Ranbeer Kapoor)తో చేసిన అనిమల్ (Animal) సినిమా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును తీసుకురావడమే కాకుండా ఆయన మేకింగ్ లోని కొత్తదనాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఒక అనిమల్ క్యారెక్టర్ తో సినిమా ను తీసి లాంటి స్టార్ డమ్ ని చూపించవచ్చు. ఆ అనిమల్ లాంటి మనిషి ఎవరైనా తన తండ్రి జోలికి వస్తే ఎలా మారుతాడు అనే ఒక పాయింట్ ను ఈ సినిమాలో చాలా ఎక్స్ట్రాడినరీగా చూపించే ప్రయత్నం చేశాడు. మరి ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) తో స్పిరిట్(Spirit) అనే సినిమా చేయబోతున్నాడు.
కాబట్టి ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలైతే ఉన్నాయి. దాదాపు ఈ సినిమాను 500 కోట్ల బడ్జెట్ తెరకెక్కబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఏది ఏమైనా ఈ సినిమా పాన్ వరల్డ్ సినిమాగా రాబోతుండటంతో ఈ సినిమా మీద యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరికి చాలా మంచి అభిప్రాయం అయితే ఉంది…
మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన సినిమాలో కాస్ట్యూమ్స్ కోసం ఎలాంటి డ్రెస్ లను రిఫర్ చేయాలి అని అనుకున్నప్పుడు నాగచైతన్య తన నిజ జీవితంలో వేసుకున్న కాస్ట్యూమ్స్ చూసి ఇన్స్పైర్ అయ్యి సందీప్ తన హీరోకి కూడా అలాంటి డ్రెస్లే కావాలని తన కాస్ట్యూమ్ డిజైనర్స్ కి చెబుతూ ఉండేవాడట.
ఇక రీసెంట్ గా జరిగిన తండేల్ ఈవెంట్లో ఆయన ఈ మాటలు చెబుతూ ఉండడం అందరినీ ఆకర్షించాయి. మరి మొత్తానికైతే సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు నాగచైతన్య లాంటి హీరోని ఫాలో అవుతూ ఉండడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…