Virat Kohli: టెస్ట్, వన్డే, టి20.. ఇలా ఫార్మాట్ తో సంబంధం లేకుండా పరుగుల వరద పారించిన ఘనత విరాట్ కోహ్లీకి దక్కుతుంది. అందుకే టీమిండియాలో అతడిని చేజ్ మాస్టర్, రన్ మిషన్ అని పిలుస్తుంటారు. విరాట్ కోహ్లీ ఎక్కువగా చేజింగ్ సమయంలోనే పరుగుల వరద పారించాడు. ఆస్ట్రేలియా నుంచి మొదలు పెడితే న్యూజిలాండ్ వరకు అనితర సాధ్యమైన రికార్డులను సాధించాడు. అందువల్లే చేజింగ్ సమయంలో విరాట్ కోహ్లీ మైదానంలో పాతుకు పోయాడంటే ప్రత్యర్థి జట్టు గెలుపు పై ఆశలు వదిలేసుకోవాల్సిందే. ప్రస్తుతం విరాట్ వయసు 37 సంవత్సరాలు. అయినప్పటికీ అతడు శరీర సామర్థ్య విషయంలో సరికొత్త ప్రమాణాల నెలకొల్పుతున్నాడు. తాగే నీళ్లను విదేశాల నుంచి దిగిన చేసుకుంటున్నాడు. తినే తిండిని ప్రత్యేకమైన నిపుణులతో తయారు చేయించుకుని తింటున్నాడు. ఇటీవల బీసీసీఐ ఆంక్షలు విధించినప్పటికీ.. దుబాయ్ లో ప్రత్యేకంగా ఆహారాన్ని తెప్పించుకొని తిన్నాడు. ఇటీవల న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 85 పరుగుల వద్ద అవుటయిన విరాట్.. తనకు ఇష్టమైన పండ్లను తిన్నాడు. అభి తింటూనే మ్యాచ్ ను వీక్షించాడు.
Also Read: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ముందు న్యూజిలాండ్ జట్టుకు కోలు కోలేని షాక్
సెంచరీలు మాత్రమే కాదు..
విరాట్ కోహ్లీ సెంచరీలు మాత్రమే కాదు.. సింగిల్ రన్స్ లో కూడా సరికొత్త బెంచ్ మార్క్ సృష్టించాడు. వాస్తవానికి ఆటగాళ్లు ఫోర్లు, సిక్సర్ల కంటే సింగిల్స్ మీదనే ఎక్కువగా దృష్టి సారిస్తారు. కాకపోతే అభిమానులకు ఫోర్లు, సిక్సర్లు అంటేనే ఇష్టం. ఇన్నింగ్స్ ముందుకు తీసుకెళ్లడానికి సింగిల్స్, డబుల్స్ కీలకపాత్ర పోషించాయి. అలా పరుగులు తీయడంలో విరాట్ కోహ్లీది అందె వేసిన చేయి. విరాట్ కోహ్లీ 301 వన్డేలలో 14,180 పరుగులు చేశాడు. ఇందులో సింగిల్స్ ద్వారానే 5,870 పరుగులు చేశాడు. వన్డేలలో 2000 సంవత్సరం జనవరి నుంచి ఒక క్రికెటర్ కు ఇవే అత్యధిక పరులు కావడం విశేషం. ఇక విరాట్ కోహ్లీ తర్వాత సంగక్కర 5,503, జయవర్ధనే 4,789, ధోని 4,470, పాంటింగ్ 3,916, రోహిత్ శర్మ 3,759 పరుగులు సింగిల్స్ ద్వారా చేశారు. 35 సంవత్సరాల వయసులోనూ విరాట్ కోహ్లీ వికెట్ల మధ్య వేగంగా పరుగులు తీస్తాడు. అత్యంత సులువుగా సింగిల్స్ తీస్తాడు. మ్యాచ్ ను టీమిండియా వైపు మరలే విధంగా చేస్తాడు. అందువల్లే విరాట్ కోహ్లీని చేజింగ్ మాస్టర్ అని పిలుస్తారు. రన్ మిషన్ అని కూడా అంటారు. ఇక చాంపియన్స్ ట్రోఫీ లోనూ విరాట్ కోహ్లీ సింగిల్ రన్స్ ఎక్కువ తీశాడు.