Homeక్రీడలుక్రికెట్‌Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్ మెంట్.. అనుష్కశర్మ ఏమోషనల్ పోస్ట్ వైరల్

Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్ మెంట్.. అనుష్కశర్మ ఏమోషనల్ పోస్ట్ వైరల్

Virat Kohli : టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహ్లీ భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ తన భర్త నిర్ణయాన్ని స్వాగతిస్తూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఆమె మాటలు వింటే ఎవరికైనా కళ్లు చెమర్చడం ఖాయం.

అనుష్క తన పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చింది: “అందరూ రికార్డులు, మైలురాళ్ల గురించే మాట్లాడుకోవచ్చు. కానీ నాకు మాత్రం నువ్వు లోపల దాచుకున్న కన్నీళ్లు, బయటకు ఎవరికీ తెలియనీయకుండా నువ్వు చేసిన పోరాటాలు గుర్తుండిపోతాయి. టెస్టు ఫార్మాట్‌పై నువ్వు చూపించిన ప్రేమను నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను. ప్రతి టెస్టు సిరీస్ తర్వాత నువ్వు మరింత గొప్పగా తిరిగి వచ్చే వాడివి. నువ్వు ఎదిగిన తీరును దగ్గరగా చూడడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఏదో ఒక రోజు నువ్వు టెస్టుల నుంచి రిటైర్ అవుతావని నాకు తెలుసు. కానీ, నువ్వు ఎప్పుడూ నీ మనసు చెప్పిన ప్రకారమే నిర్ణయం తీసుకుంటావు. ఆటలో నువ్వు అన్నీ సాధించావు. ఇప్పుడు గుడ్ బై చెప్పడానికి నువ్వు పూర్తిగా అర్హుడివని నేను భావిస్తున్నాను” అంటూ అనుష్క తన ప్రేమను, భావోద్వేగాన్ని వ్యక్తం చేసింది.

అనుష్క పోస్ట్ చూస్తుంటే విరాట్ టెస్ట్ క్రికెట్‌కు ఎంత అంకితభావంతో ఆడాడో అర్థమవుతోంది. రికార్డులు, విజయాల వెనుక ఎన్నో కష్టాలు, పోరాటాలు ఉన్నాయని ఆమె గుర్తు చేసింది. భర్త ప్రయాణంలో తోడుగా ఉంటూ, అతడి కష్టాలను దగ్గరగా చూసిన అనుష్క మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు కూడా అనుష్క పోస్ట్‌పై తమ స్పందనలు తెలియజేస్తున్నారు. కోహ్లీ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ అతని భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మొత్తానికి, విరాట్ కోహ్లీ టెస్టు కెరీర్‌కు ముగింపు పలకడం అభిమానులకు కాస్త బాధ కలిగించినప్పటికీ, అనుష్క శర్మ పోస్ట్‌తో అందరి మనసులను గెలుచుకుంది. ఒక భార్యగా ఆమె తన భర్త పట్ల చూపించిన ప్రేమ, గౌరవం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.

కోహ్లీ 2008లో 19 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. తన అద్భుతమైన ఆటతీరుతో త్వరగానే జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. అతను వన్డే ఇంటర్నేషనల్ (ODI) క్రికెట్‌లో అనేక రికార్డులు సృష్టించాడు. చాలా కాలం పాటు ఐసీసీ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. టెస్ట్ క్రికెట్‌లో కూడా కోహ్లీ తనదైన ముద్ర వేశాడు. అతను 123 టెస్టుల్లో 46.85 సగటుతో 9230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 31 అర్థ సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడు. అంతేకాకుండా, అతను టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీలు (7) చేసిన భారతీయ క్రికెటర్.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version