Virat Kohli : రికార్డులను సృష్టించడంలో విరాట్ కోహ్లీ తర్వాతే ఎవరైనా. అలాంటి ఆటగాడు ప్రస్తుతం ఫామ్ లో లేకపోయినప్పటికీ సోమవారం నాటి కాన్పూర్ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి.. 47 పరుగులు చేశాడు. తద్వారా సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. బంగ్లాదేశ్ పై 47 పరుగులు చేయడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లీ 27 వేల పరుగుల మైలు స్టోన్ కు చేరుకున్నాడు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ రికార్డు సొంతం చేసుకున్నా రెండవ భారతీయ ఆటగాడిగా విరాట్ నిలిచాడు. మొత్తంగా చూస్తే ఈ ఘనతను సాధించిన నాలుగవ ఆటగాడిగా కోహ్లీ కొనసాగుతున్నాడు. కోహ్లీ కంటే ముందు 34, 357, కుమార సంగక్కర 28, 016, రికీ పాంటింగ్ 27,483 ఉన్నారు. కోహ్లీ ప్రస్తుతం 27,012 పరుగులతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు టెస్టులలో 8,918, వన్డేలలో 13,906, టీ 20 లలో 4,188 పరుగులు సాధించాడు. అయితే అత్యంత వేగంగా 27 వేల పరుగులు సాధించిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ముందు వరసలో కొనసాగుతున్నాడు. ఈ పరుగులు చేయడానికి సచిన్ టెండూల్కర్ 623 ఇన్నింగ్స్ లు ఆడాడు. విరాట్ కోహ్లీ 594 ఇన్నింగ్స్ లలోనే 27 వేల పరుగులు పూర్తి చేయడం విశేషం. అయితే తొలి టెస్ట్ లో విరాట్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. సుదీర్ఘ విరామం తర్వాత టెస్ట్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. అతడు తన మునుపటి ఫామ్ కొనసాగించలేకపోయాడు. తొలి టెస్ట్ 2 ఇన్నింగ్స్ లలో బంగ్లా బౌలర్లు విరాట్ ను త్వరగా అవుట్ చేశారు. అయితే రెండవ ఇన్నింగ్స్ లో తాను వికెట్ల ముందు దొరకక పోయినప్పటికీ.. ఎంపైర్ అవుట్ ఇవ్వగానే.. రివ్యూ తీసుకోకుండానే విరాట్ పెవిలియన్ చేరుకున్నాడు. విరాట్ వ్యవహార శైలిపై టీమిండియా కెప్టెన్ రోహిత్ కూడా ఆశ్చర్యపోయాడు.
ఇక కాన్పూర్ లో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు దాదాపు పావు వంతు ఆట వర్షం వల్ల నిలిచిపోయింది. రెండు, మూడు రోజుల్లో అసలు మైదానంలో అడుగుపెట్టే అవకాశం లేకుండా పోయింది. నాలుగు రోజు మాత్రం ఆట జోరుగా కొనసాగింది. రెండు జట్లు కలిపి 411 పరుగులు చేశాయి.. ఏకంగా 18 వికెట్లు నేలకులాయి. అయితే భారత సాధించిన 285 పరుగులలో విరాట్ కూడా తన వంతు పాత్ర పోషించాడు. 35 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో అతడు 47 చేశాడు. అయితే దురదృష్టవశాత్తు షకీబ్ బౌలింగ్లో అతడు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. లేకుంటే టీమ్ ఇండియా స్కోర్ మరింత రాకెట్ వేగంతో వెళ్లిపోయేది.