https://oktelugu.com/

Ind vs Ban : బంగ్లా పై బంతుల మెలికలు.. నేలకూలిన వికెట్లు.. అరుదైన రికార్డులు సొంతం చేసుకున్న రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా..

బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్పిన్ బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా సరికొత్త ఘనతను సొంతం చేసుకున్నారు. అద్భుతమైన బౌలింగ్ ద్వారా అరుదైన రికార్డులను తమ పాదా క్రాంతం చేసుకున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : September 30, 2024 10:02 pm

    Ravichandran Ashwin, Ravindra Jadeja

    Follow us on

    Ind vs Ban : చెన్నైలో జరిగిన టెస్టులో అటు బ్యాట్, ఇటు బంతితో రవిచంద్రన్ అశ్విన్ మెరిశాడు. ఏకంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాన్ని దక్కించుకున్నాడు. అదే ఊపులో రెండవ టెస్టులోనూ అరుదైన రికార్డును సాధించాడు.. రెండవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో అశ్విన్ రెండు వికెట్లు సాధించాడు. ఫలితంగా మూడు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లలో 50 కి పైగా వికెట్లు తీసిన తొలి బౌలర్ గా ఆవిర్భవించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ 2019-21 సీజన్ లో 14 మ్యాచ్ లు ఆడి 71 వికెట్లు పడగొట్టాడు. 2021 -23 సీజన్లో 61 వికెట్లు సాధించాడు. 2023-25 సీజన్లో ఇప్పటివరకు 50 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ ర్యాంకింగ్ లో బౌలర్ల విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతడు ఇదే జోరు కొనసాగిస్తే మరిన్ని రికార్డులను సొంతం చేసుకుంటాడు.

    ఆరు వికెట్లు

    ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఇప్పటివరకు అశ్విన్ 182 వికెట్లు సాధించాడు. మరో ఆరు వికెట్లు పడగొడితే ఆస్ట్రేలియా స్పిన్నర్ లయన్ 187 రికార్డును అధిగమిస్తాడు. వీరిద్దరి తర్వాత స్థానంలో ఆస్ట్రేలియా బౌలర్ కమిన్స్ 175 వికెట్లతో కొనసాగుతున్నాడు.

    రెండు వికెట్లు

    వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023-25 లో అశ్విన్ 50 వికెట్లతో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్ హేజిల్ ఉడ్ 51 వికెట్లతో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. మరో రెండు వికెట్లు పడగొడితే అశ్విన్ అతడిని అధిగమిస్తాడు.

    జహీర్ ఖాన్ ను అధిగమించాడు..

    బంగ్లాదేశ్ జట్టుతో ఇప్పటివరకు జరిగిన టెస్ట్ సిరీస్ లలో అశ్విన్ 31 వికెట్లు పడగొట్టాడు. జహీర్ ఖాన్ కూడా 31 వికెట్లు సాధించాడు. అయితే రెండవ ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ ఆటగాలను ఇద్దరినీ అవుట్ చేయడం ద్వారా జహీర్ ఖాన్ ను అశ్విన్ అధిగమించాడు.

    జడేజా సరికొత్త రికార్డు

    టెస్ట్ క్రికెట్లో 300 వికెట్లు పడగొట్టిన ఏడవ భారత బౌలర్ గా రవీంద్ర జడేజా రికార్డు సృష్టించాడు. బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన రెండవ టెస్టులో రిటర్న్ క్యాచ్ ద్వారా జడేజా వికెట్ పడగొట్టాడు. జడ జ కంటే ముందు అనిల్ కుంబ్లే 619, అశ్విన్ 524, కపిల్ దేవ్ 434, హర్భజన్ 417, ఇశాంత్ శర్మ 311, జహీర్ ఖాన్ 311 వికెట్లతో ముందు వరుసలో ఉన్నారు. ఇక రవీంద్ర జడేజా ఆసియాలోనే టెస్టులలో అత్యంత వేగంగా 3000 పరుగులు చేయడంతో పాటు.. 300 వికెట్లు పడగొట్టిన ఈ తరం క్రికెటర్ గా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.