https://oktelugu.com/

game changer : గేమ్ చేంజర్ ‘రా మచ్చ మచ్చ’ పాట కోసం ఎంత బడ్జెట్ అయ్యిందో తెలుసా..? ఆ డబ్బులతో మూడు సినిమాలు తీసేయొచ్చు!

'గేమ్ చేంజర్' కి కూడా అదే జరిగింది. 'రా మచ్చ మచ్చ' పాట చిత్రీకరణ కోసం ఏకంగా 28 కోట్ల రూపాయిలను ఖర్చు చేశారట.

Written By:
  • NARESH
  • , Updated On : September 30, 2024 / 10:20 PM IST

    Game Changer(2)

    Follow us on

    game changer  : సౌత్ ఇండియా లో అపజయం అనేదే ఎరుగని దర్శకుల లిస్ట్ తీస్తే అందులో మనకి రాజమౌళి తో పాటు , శంకర్ పేరు కూడా వినిపిస్తుంది. ఈయన సినిమాలు అన్నీ ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. సమాజం లో జరిగే బర్నింగ్ సమస్యల మీద తనదైన మార్కు స్క్రీన్ ప్లే తో సినిమా తీసి ప్రేక్షకులను అబ్బురపర్చడం శంకర్ స్టైల్. మన చిన్న తనం నుండే ఆయన ఇలాంటి సినిమాలు చేస్తూ పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసాడు. అలాంటి శంకర్ నుండి రీసెంట్ గా ‘ఇండియన్ 2’ వంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ రావడం ఆయన అభిమానులను ఎంతో నిరాశపరిచింది. అసలు ఈ సినిమాకి శంకర్ దర్శకత్వం వహించాడు అంటే ఎవ్వరూ నమ్మలేకపోయారు. అంత దరిద్రంగా ఆ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా తర్వాత ఆయన రామ్ చరణ్ తో ‘గేమ్ చేంజర్’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.

    ఇండియన్ 2 ని చూసి గేమ్ చేంజర్ ని ఏ రేంజ్ లో తీసి ఉంటాడో అని రామ్ చరణ్ అభిమానులు భయపడుతున్నారు. కానీ ఇప్పుడిప్పుడే ఈ సినిమా పై అభిమానుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఎందుకంటే మొదటి పాట ‘జరగండి..జరగండి’ పెద్ద హిట్ అయ్యింది. ఈ పాట తర్వాత కొంత గ్యాప్ తీసుకొని నేడు ‘రా మచ్చ మచ్చ’ పాటను విడుదల చేసారు. ఈ పాటకు అభిమానుల నుండి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పిక్చరైజేషన్ లో ఒకప్పటి శంకర్ మార్కు కనిపించింది. ఆయన సినిమాల్లోని పాటలు ఎంత ప్రత్యేకంగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేవలం పాటల కోసమే సగం బడ్జెట్ ఖర్చు చేయిస్తాడు ఆయన తన నిర్మాతలతో. ‘గేమ్ చేంజర్’ కి కూడా అదే జరిగింది. ‘రా మచ్చ మచ్చ’ పాట చిత్రీకరణ కోసం ఏకంగా 28 కోట్ల రూపాయిలను ఖర్చు చేశారట.

    వైజాగ్ బీచ్ రోడ్ లో ఈ పాటని చిత్రీకరించారు. బాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఈ పాటకు కొరియోగ్రఫీ చేసాడు. లిరికల్ వీడియో చూడగానే మనకి ఈ పాట ఎంత రిచ్ గా ఉందో అర్థమైంది. సినిమాలో ఇది రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్ అట. ఆయన స్టెప్పులు కూడా పాటలో అదిరిపోయాయి. చూస్తుంటే రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్స్ లో ఇది ఒకటిగా నిలిచిపోతుంది అని చెప్పొచ్చు. కేవలం ఒక్క పాట కోసం 28 కోట్ల రూపాయిలు ఖర్చు అంటే, ఆ డబ్బులతో ఎన్ని చిన్న సినిమాలు తియ్యొచో ఊహించుకోండి. శంకర్ తో సినిమా అంటే ఆ రేంజ్ లో ఉంటుంది మరి. ఇకపోతే ఈ చిత్రాన్ని డిసెంబర్ 20 వ తారీఖున విడుదల చేయబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. సంక్రాంతికి కూడా ఆ డేట్ మారొచ్చని అంటున్నారు. దీనిపై క్లారిటీ దసరా రోజు ఇవ్వనుంది మూవీ టీం.