Virat Kohli : జస్ట్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేస్తే వైరల్ అవుతుంది. మైక్ అందుకొని ఒక మాట మాట్లాడితే సంచలనం రేపుతుంది. బ్యాట్ పట్టుకొని ఇన్నింగ్స్ ఆడితే బంతి బద్దలవుతుంది. వేగంగా వచ్చే బంతిని క్యాచ్ పట్టుకుంటే స్టేడియం ఊగిపోతుంది. అందుకే విరాట్ కోహ్లీని సమకాలీన క్రికెట్లో సమ్మోహన రూపుడు అంటారు. సుదీర్ఘకాలం ఐపీఎల్లో బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్నప్పటికీ.. ఆ జట్టు తరుపున భారీగా పరుగులు చేస్తున్నప్పటికీ.. ఇంతవరకు బెంగళూరు ఐపిఎల్ ట్రోఫీ అందుకోలేదు. అయినప్పటికీ విరాట్ కోహ్లీ కి ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా.. ఐపీఎల్ లో బెంగళూరు నుంచి కెప్టెన్సీ తప్పుకున్నా విరాట్ కోహ్లీ మానియా ఏమాత్రం తగ్గలేదు. తగ్గే అవకాశం కూడా కనిపించడం లేదు. అతడు కనిపిస్తే.. అతని మాట వినిపిస్తే.. బెంగళూరు అభిమానులే కాదు.. యావత్ క్రికెట్ ఫ్యాన్స్ పూనకాలు వచ్చినట్టు ఊగిపోతున్నారు. అతనిని చూస్తే చాలు జన్మ ధన్యమైపోయింది అని భావిస్తున్న వారు చాలామంది.. అందుకే విరాట్ కోహ్లీని బెంగళూరు జట్టు ఇప్పటికి తనతోనే ఉంచుకుంటున్నది. ఇకపై కూడా ఉంచుకుంటుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు.
Also Read : కింగ్ అని ఊరికే అంటారా.. ఆకాశ్ అంబానీ కూడా బిత్తర పోయాడు!
విరాట్ కోహ్లీకి పెద్ద ఫ్యాన్
విరాట్ కోహ్లీని క్రికెట్ తో సంబంధం లేకుండా చాలామంది అభిమానిస్తారు. చాలామంది ఆరాధిస్తుంటారు. అతనితో ఒక ఫోటో దిగాలని.. అతనితో మాట కలపాలని..కోరుకునే దిగ్గజాలు చాలామంది ఉన్నారు. అయితే అలాంటి విరాట్ కోహ్లీ మల్లయోధుడు జాన్ సీనా (John sena) కు ఆరాధ్య ఆటగాడు అయిపోయాడు. జాన్ సీనా ప్రపంచ వ్యాప్తంగా పేరుపొందిన మల్లయోధుడు. అతన్ని కోట్ల మంది అభిమానిస్తుంటారు. అతడు ప్రత్యర్థులపై ముష్టి ఘాతాలు కురిపిస్తుంటే ఎగిరి గంతులు వేసేవారు చాలామంది. అదే అటువంటి జాన్ సీనా ను విరాట్ కోహ్లీ విపరీతంగా ఆకర్షించాడు. అతడి ఆట తీరు.. అతని మాట తీరు.. అతడు తన శరీర సామర్థ్యాన్ని కాపాడుకునే తీరు.. కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యం తీరు జాన్ సీనా కు విపరీతంగా నచ్చింది. ఇక ఇటీవల విరాట్ కోహ్లీ తన వేలికి పెట్టుకున్న ఉంగరాన్ని చూపిస్తూ ఒక ఫోటో దిగాడు. దానిని జాన్ సీనా తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీగా పెట్టుకున్నాడు. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ” విరాట్ ను మామూలు అభిమానులు కాదే.. దిగ్గజ మల్లయోధులు కూడా అభిమానిస్తుంటారు. దానికి నిదర్శనం ఈ చిత్రం. ఇక ఇంతకుమించి చెప్పేది ఏముండదని” విరాట్ అభిమానులు పేర్కొంటున్నారు.
Also Read : విరాట్ భయ్యా అదేం కొట్టుడు.. బ్యాట్ ఏమైనా చేతులకు మొలిచిందా?
INSTAGRAM POST OF JOHN CENA…!!!!
– The Range of King Kohli pic.twitter.com/kcFfnCwO6A
— Johns. (@CricCrazyJohns) April 9, 2025