Virat Kohli: ప్రస్తుతం ఐపీఎల్ 18వ ఎడిషన్ నడుస్తోంది. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు ఆడాడు. రెండు సార్లు హాఫ్ సెంచరీలు చేశాడు. మొత్తంగా 164 పరుగులు చేశాడు. అతడు విఫలమైనప్పుడు బెంగళూరు జట్టు ఓడిపోయింది. అతడు బ్యాట్ తో వీరంగం చేసినప్పుడు జట్టు నిలబడింది. కాదు కాదు ప్రత్యర్థి పై కలబడి నిలిచింది. అందుకే విరాట్ కోహ్లీ అంటే పేరు మాత్రమే కాదు.. అది ఒక బ్రాండ్.. వీరోచితానికి.. హీరోచితానికి.. బ్యాటోచితానికి అది ఒక సిగ్నేచర్.. అందుకే విరాట్ కోహ్లీని ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు కూడా ప్రేమిస్తుంటారు. ఆరాధిస్తుంటారు. అభినందిస్తుంటారు. అనుసరిస్తుంటారు.. విరాట్ కోహ్లీ తో మాట్లాడాలని.. విరాట్ కోహ్లీ తో కలిసి కప్పు కాఫీ తాగాలని.. వీలుంటే డిన్నర్ చేయాలని అనుకుంటారు. ఈ అభిప్రాయాన్ని ఎంతో మంది ఆటగాళ్లు వివిధ వేదికల వద్ద పంచుకున్నారు.. ఇప్పుడు ముంబై ఇండియన్స్ జట్టు ఆటగాళ్లకు ఆ వంతు వచ్చింది.
Also Read: కోహ్లీ దంచికొడుతున్నాడు.. రోహిత్ తండ్లాడుతున్నాడు.
ఆకాశ్ అంబానీ కూడా చూస్తూ ఉండిపోయాడు
సోమవారం ముంబై వేదికగా ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు తరఫున విరాట్ కోహ్లీ 67 పరుగులు చేశాడు. 42 బంతులు ఎదుర్కొన్న అతడు రెండు విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అందువల్లే బెంగళూరు ఆ స్థాయిలో స్కోర్ చేయగలిగింది. ఇక విరాట్ కోహ్లీ ముంబై ఇన్నింగ్స్ సమయంలో ఫీల్డింగ్ అద్భుతంగా చేశాడు. కృణాల్ పాండ్యా బౌలింగ్లో విల్ జాక్స్ ఇచ్చిన క్యాచ్ ను అద్భుతంగా అందుకొని.. ముంబై జట్టు ఓటమికి నాంది పలికాడు. అది హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్లో బెంగళూరు 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ముగిసిన తర్వాత ముంబై ఆటగాళ్లు విరాట్ కోహ్లీతో ఫోటోలు దిగడానికి పోటీలు పడ్డారు.. యువ సంచలనాలు విగ్నేష్, అశ్విని కుమార్.. ఇంకా మిగతా ఆటగాళ్లు విరాట్ కోహ్లీతో ఫోటోలు దిగారు. కొందరు ఆటగాళ్లు బ్యాటింగ్లో మెలకువలు నేర్చుకున్నారు. ఓడిపోయిన బాధ ఆ ఆటగాళ్లలో పెద్దగా కనిపించలేదు. అయితే విరాట్ కోహ్లీ నిన్ను చూడగానే వారి కళ్ళల్లో తెలియని ఆనందం కనిపించింది. దేవుడిని చూస్తున్నట్టు.. అతనితో మాట్లాడుతున్నట్టుగా వారిలో హావభావాలు కనిపించాయి. మొత్తంగా విరాట్ కోహ్లీ వారితో నవ్వుకుంటూ ఫోటోలు దిగాడు. వారితో కుళ్లు జోకులు వేసుకుంటూ నవ్వించాడు. తను కూడా నవ్వాడు. మొత్తంగా ముంబై మైదానాన్ని తన వైపు చూసేలా చేశాడు. చివరికి ముంబై జట్టు యజమాని ఆకాష్ అంబానీ కూడా తనను చూసి కుళ్ళుకునేలా చేసుకున్నాడు. డబ్బుంటే ప్రేమ రాదు. డబ్బుంటే ఆప్యాయత రాదు. డబ్బుంటే అనురాగం రాదు. ఇవన్నీ దక్కాలంటే ఏదో ఒకటి గొప్పది సాధించాలి. గొప్పగా నిలబడాలి. గొప్పగా కనిపించాలి. అప్పుడే మనం గొప్ప వాళ్ళం అవుతాం. గొప్పగా ఎదుటి వాళ్లకు కూడా కనిపిస్తాం. విరాట్ కోహ్లీ ఇది చేతి చూపించాడు కాబట్టే గొప్పవాడు అయ్యాడు.. అంతకుమించి ఆరాధ్య క్రికెటర్ అయ్యాడు.
EVERY MI YOUNGSTERS TAKING A PICTURE WITH KING
– Kohli, An Inspiration…!!!! pic.twitter.com/POR6SYt6Ck
— Johns. (@CricCrazyJohns) April 7, 2025