సాధారణంగా గెలిచిన కెప్టెన్.. ఓడిన కెప్టెన్ ను చూసి గేలి చేస్తారు. లేదా మేము గెలిచామని బీరాలకు పోతారు. పాత పగలన్నింటిని తీర్చుకునేలా వ్యవహరిస్తారు.. కానీ న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలయమ్స్ సన్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా టీమిండియా కెప్టెన్ కోహ్లీ ఒడిలో ఒదిగిపోయాడు.. కోహ్లీని ఓడించి అతడి ఒడిలో అలా ఒదిగిన ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇలా ఏ కెప్టెన్ చేయడు. దానికి కారణమేంటో తాజాగా కివీస్ కెప్టెన్ కేన్ విలయమ్ససన్ బయటపెట్టారు.
ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్లో ఇటీవల ఇండియా టీంను న్యూజిలాండ్ చిత్తుగా ఓడించింది. గెలిచిన అనంతరం విలయమ్సన్ నేరుగా కోహ్లీ వద్దకు కౌగిలించుకున్నాడు. ఇది వైరల్ అయ్యింది. ఆ ఫొటో సామాజికమాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది.
దీనిపై తాజాగా కేన్ స్పందించాడు. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, తాను సహచరులమని న్యూజిలాండ్ కెప్టెన్ విలయమ్సన్ చెప్పుకొచ్చారు. తామిద్దరం సుధీర్ఘకాలంగా సన్నిహిత మిత్రులమని.. అంతర్జాతీయ క్రికెట్ లోనూ స్నేహబంధాలు కొనసాగిస్తున్నామని తెలిపారు.
క్రీడల వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలామందిని కలిసే అవకాశం దొరికిందని.. భిన్నమైన స్నేహబంధాలు కూడా లభించాయని.. కలిసి ఆడినా.. ఎదురెదురుగా తలపడినా ఇద్దరి ఆసక్తులు, ఇష్టాయిష్టాలు ఒకేలా ఉంటాయని కోహ్లీ తనకు మంచి మిత్రుడు అని కేన్ విలయమ్సన్ చెప్పుకొచ్చాడు. ఒక మ్యాచులో ఓడిపోయినంత మాత్రాన టీం ఇండియాను తక్కువ అంచనావేయొద్దని.. అది బలమైన జట్టు అని పేర్కొన్నాడు.