IPL 2025
IPL 2025: 2025లో 18వ సీజన్ మొదలవుతుంది. మార్చి 21 నుంచి ఐపీఎల్ ప్రారంభమవుతుంది. అయితే ఇప్పటివరకు దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను బీసీసీఐ(BCCI) వెల్లడించలేదు. దీంతో అభిమానులు షెడ్యూల్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరో వారం రోజుల్లో ఐపీఎల్ 2025 సీజన్(IPL 2025 season) కు సంబంధించి షెడ్యూల్ విడుదలవుతుందని తెలుస్తోంది.. ప్రఖ్యాత స్పోర్ట్స్ టాక్(sports talk) నివేదిక ప్రకారం.. ఐపీఎల్ 2025 సీజన్ లో ఫైనల్ మ్యాచ్ కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతుందని తెలుస్తోంది. మే 25న ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారని సమాచారం.. ప్లే ఆఫ్ -2 మ్యాచ్ కూడా కోల్ కతా లోనే నిర్వహిస్తారట. ప్లే ఆఫ్ -1, ఎలిమినేటర్ మ్యాచ్ లు హైదరాబాద్ లోని ఉప్పల్ మైదానంలో జరుగుతాయట.
ప్రతి సీజన్లో ప్రారంభ మ్యాచ్ డిపెండింగ్ ఛాంపియన్ ఆడుతుంది.. ఐపీఎల్ 2024 సీజన్లో విజేతగా కోల్ కతా జట్టు నిలిచింది. అయితే ప్రారంభ మ్యాచ్లో కోల్ కతా తో తలపడే జట్టు ఏదో త్వరలో తేలనుంది. ప్రతి జట్టు తమ సొంత మైదానంలో సగం మ్యాచులు ఆడతాయి. మిగతా మ్యాచ్లను ప్రత్యర్థి మైదానాలలో ఆడతాయి. అయితే ఈసారి రాజస్థాన్, ఢిల్లీ జట్లు తమ మ్యాచ్లను సొంత మైదానాలతో పాటు మరో మైదానంలో ఆడతాయి. రాజస్థాన్ సొంతమైదానం జైపూర్ లోని సవాయి మాన్సింగ్ స్టేడియం.. ఈ మైదానంలో ఐదు మ్యాచ్లు.. అస్సాంలోని బర్సా పారా క్రికెట్ స్టేడియంలో రెండు మ్యాచ్లు రాజస్థాన్ జట్టు ఆడుతుంది. ఇక ఢిల్లీ జట్టు తమ సొంత మైదానమైన అరుణ్ జైట్లీ స్టేడియంలో ఐదు మ్యాచ్లు ఆడుతుంది. ఆ తర్వాత విశాఖపట్నంలోని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్, విశాఖపట్నం డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో రెండు మ్యాచ్లు ఆడుతుంది.
639 కోట్లు
ఐపీఎల్ 2025 సీజన్ కు సంబంధించి గత ఏడాది నవంబర్లో మెగా వేలం జరిగింది. సౌదీ అరేబియాలోని జెడ్డా లో ఈ మెగా వేలం జరిగింది. అన్ని జట్లు తమకు కావలసిన ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. తమ జట్లకు కావలసిన శక్తి సామర్థ్యాలను కల్పించుకున్నాయి. వేలం రెండు రోజులపాటు జరగగా..182 మంది ఆటగాళ్ల కోసం దాదాపు అన్ని యాజమాన్యాలు 639.5 కోట్లను ఖర్చు చేశాయి. టీమిండియా యువ సంచలనం రిషబ్ పంత్ ను లక్నో జట్టు యాజమాన్యం 27 కోట్లకు కొనుక్కుంది. తద్వారా ఐపిఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్ గా పంత్ రికార్డు సృష్టించాడు. శ్రేయస్ అయ్యర్ ను 26.75 కోట్లకు పంజాబ్ జట్టు కొనుగోలు చేసింది. వెంకటేష్ అయ్యర్ ను 23.75 కోట్లకు కోల్ కతా జట్టు కొనుక్కుంది.