Homeక్రీడలుక్రికెట్‌Virat Kohli Knee Injury: నాతో కావడం లేదు.. విరాట్ కోహ్లీ నోట ఆ మాట.....

Virat Kohli Knee Injury: నాతో కావడం లేదు.. విరాట్ కోహ్లీ నోట ఆ మాట.. సంచలనం

Virat Kohli Knee Injury: తాగే నీటి నుంచి తినే తిండి వరకు ఎంతో జాగ్రత్తగా ఉంటాడు విరాట్ కోహ్లీ. వాటన్నిటినీ కూడా విదేశాల నుంచి తెప్పించుకుంటాడు. వాటి కోసం భారీగా ఖర్చు పెడుతుంటాడు. అందువల్లే విరాట్ కోహ్లీ ఫిట్ నెస్ ఫ్రీక్ అని పిలుస్తుంటారు. శారీరక దృఢత్వానికి కూడా అతడు ఎక్కువ ప్రాధాన్యమిస్తాడు. అందువల్లే జంక్ ఫుడ్ జోలికి అసలు వెళ్ళడు. నూనె పదార్థాలను ముట్టుకోడు. కొవ్వులను దరిదాపుల్లోకి కూడా రానివ్వడు. అందువల్లే విరాట్ కోహ్లీ […]

Virat Kohli Knee Injury: తాగే నీటి నుంచి తినే తిండి వరకు ఎంతో జాగ్రత్తగా ఉంటాడు విరాట్ కోహ్లీ. వాటన్నిటినీ కూడా విదేశాల నుంచి తెప్పించుకుంటాడు. వాటి కోసం భారీగా ఖర్చు పెడుతుంటాడు. అందువల్లే విరాట్ కోహ్లీ ఫిట్ నెస్ ఫ్రీక్ అని పిలుస్తుంటారు. శారీరక దృఢత్వానికి కూడా అతడు ఎక్కువ ప్రాధాన్యమిస్తాడు. అందువల్లే జంక్ ఫుడ్ జోలికి అసలు వెళ్ళడు. నూనె పదార్థాలను ముట్టుకోడు. కొవ్వులను దరిదాపుల్లోకి కూడా రానివ్వడు. అందువల్లే విరాట్ కోహ్లీ ఈ కాలపు పరుగుల యంత్రంలాగ కొనసాగుతున్నాడు.

ఇటీవల విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేసిన తర్వాత.. ఫీల్డింగ్ చేయలేదు. డగ్ అవుట్ లో కూర్చుని మ్యాచ్ వీక్షించాడు. అవుట్ అయిన తర్వాత హెల్మెట్ నేలకేసి కొట్టాడు. తీవ్రమైన ఆగ్రహంతో కనిపించాడు. దీంతో విరాట్ కోహ్లీకి ఏమైందని చర్చ మొదలైంది. కోహ్లీకి ఆరోగ్యం బాగోలేదని.. ఔటు అయ్యాడని కోపంతో అలా చేసి ఉంటాడని.. ఇలా రకరకాల విశ్లేషణలు వినిపించాయి.

ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ తన ఆరోగ్యం గురించి జరుగుతున్న చర్చకు సంబంధించి పుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే అతడు కీలక ప్రకటన చేశాడు. తన ఆరోగ్యానికి సంబంధించి ప్రసారంలో ఉన్న వదంతులను నమ్మకూడదని పేర్కొన్నాడు..

“కొద్దిరోజులుగా మోకాలు నొప్పి ఇబ్బంది పెడుతోంది. దీనికి తోడు అనారోగ్యం కూడా. అందువల్లే నేను ఫీల్డింగ్ చేయలేదు. దీనిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మోకాలు నొప్పి ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలోనే ఫీల్డింగ్ లోకి రాలేదు. వ్యక్తిగత ఆరోగ్యం కూడా బాగోలేదు కాబట్టి కొంతమేర విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. నేను నూటికి నూరు శాతం సామర్థ్యంతో లేను. కాకపోతే త్వరలోనే పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని ఆదుకుంటాను. అందులో ఏమాత్రం అనుమానం లేదని” విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు.

ఇటీవల రోహిత్ శర్మ గాయపడ్డాడు. కొన్ని మ్యాచ్లకు అతడు దూరమయ్యాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా మోకాలు నొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో వచ్చే వన్డే వరల్డ్ కప్ లో వీరిద్దరికీ మేనేజ్మెంట్ అవకాశం ఇవ్వడం కష్టమేనని.. వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంతవరకు అటు మేనేజ్మెంట్.. ఇటు రోకో ఎటువంటి ప్రకటన చేయలేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper