Homeక్రీడలుక్రికెట్‌Royal Challengers Bengaluru IPL 2026 Performance: నాలుగు మ్యాచ్లో నలుగురు.. రెండోసారి ఐపీఎల్ ట్రోఫీ...

Royal Challengers Bengaluru IPL 2026 Performance: నాలుగు మ్యాచ్లో నలుగురు.. రెండోసారి ఐపీఎల్ ట్రోఫీ కోసం రెడీ..

Royal Challengers Bengaluru IPL 2026 Performance: క్రికెట్లో గెలవాలంటే చాలా రకాలైన వ్యూహాలు అమలు చేయాలి. మైదానం లోకి అడుగుపెట్టకముందు రచించే వ్యూహాలు ఒక విధంగా ఉంటాయి. మైదానంలో అడుగుపెట్టిన తర్వాత.. అప్పటికప్పుడు రూపొందించే ప్రణాళికలు మరో విధంగా ఉంటాయి. అంతిమంగా ఇవన్నీ కూడా విజయానికి దోహదం చేయాలి. అప్పుడే రూపొందించిన ప్రణాళికలకు అర్థం ఉంటుంది.. ప్రస్తుత ఐపిఎల్ లో బెంగళూరు జట్టు ఇదే విధమైన ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్లాన్ ఏ తోపాటు ప్లాన్ బి […]

Royal Challengers Bengaluru IPL 2026 Performance: క్రికెట్లో గెలవాలంటే చాలా రకాలైన వ్యూహాలు అమలు చేయాలి. మైదానం లోకి అడుగుపెట్టకముందు రచించే వ్యూహాలు ఒక విధంగా ఉంటాయి. మైదానంలో అడుగుపెట్టిన తర్వాత.. అప్పటికప్పుడు రూపొందించే ప్రణాళికలు మరో విధంగా ఉంటాయి. అంతిమంగా ఇవన్నీ కూడా విజయానికి దోహదం చేయాలి. అప్పుడే రూపొందించిన ప్రణాళికలకు అర్థం ఉంటుంది.. ప్రస్తుత ఐపిఎల్ లో బెంగళూరు జట్టు ఇదే విధమైన ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్లాన్ ఏ తోపాటు ప్లాన్ బి కూడా అమలు చేస్తోంది. అందువల్లే ఆ జట్టు వరుస విజయాలు సాధిస్తూ.. అదరగొడుతోంది. ఇప్పుడు వరకు కేవలం ఒకే ఒకే మ్యాచ్లో మాత్రమే బెంగళూరు ఓడిపోయింది.

బెంగళూరులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. బ్యాటింగ్ పరంగా డోకా లేదు. బౌలింగ్ పరంగా ఇబ్బంది లేదు. ఫీల్డింగ్ పరంగా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఒక విఫలమైనా సరే, మిగతావారు జట్టు భారాన్ని మోస్తున్నారు.. జట్టును ముందుండి నడిపిస్తున్నారు. అందువల్లే బెంగళూరు జట్టు ఏమాత్రం తడబాటుకు గురి కావడం లేదు. వెనకడుగు వేయడం లేదు. బ్రేకులు లేని బుల్డోజర్ లాగా దూసుకుపోతోంది.

ఇప్పటివరకు బెంగళూరు ఐదు మ్యాచ్ లు ఆడింది. ఇందులో రాజస్థాన్ జట్టు దగ్గర మ్యాచ్ లో ఓడిపోయింది. మిగతా వాటిలో ప్రత్యర్థి జట్ల అంచనాలకు ఏమాత్రం అందకుండా బెంగళూరు బ్యాటింగ్ చేసింది. బౌలింగ్ కూడా అదే స్థాయిలో చేసింది. అందువల్లే విజయాలు అందుకుంది.

తాజాగా లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు అన్ని రంగాలలో ప్రతిభ చూపించింది. బౌలింగ్లో అదరగొట్టింది. బ్యాటింగ్లో సత్తా చూపించింది. ఫీల్డింగ్ లో అయితే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అందువల్లే లక్నో జట్టు తక్కువ స్కోరు చేయగలిగింది. ఈ స్థాయిలో ఆడింది కాబట్టి బెంగళూరు..తన ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసుకుంది. అద్భుతంగా ఆడుతున్న బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది.

ఇక ఇప్పటివరకు మ్యాచ్లలో బెంగళూరు జట్టు నుంచి.. నలుగురు ప్లేయర్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సొంతం చేసుకున్నారు. తొలి మ్యాచ్లో జాకబ్ డఫి.. మరో మ్యాచ్లో డేవిడ్.. ఇంకో మ్యాచ్లో సాల్ట్.. తాజా మ్యాచ్లో హెజెల్ వుడ్ మెన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాలు అందుకున్నారు. డిఫరెంట్ ఆట తీరుతో ఆకట్టుకుంటున్న బెంగళూరు జట్టు.. ఈసారి కూడా ట్రోఫీ అందుకుంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper