Homeఎంటర్టైన్మెంట్The Paradise Movie Release Delay: 'ప్యారడైజ్' చిత్రం ఈ ఏడాదిలో విడుదల కష్టమే..పూర్తి వివరాలు...

The Paradise Movie Release Delay: ‘ప్యారడైజ్’ చిత్రం ఈ ఏడాదిలో విడుదల కష్టమే..పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం..

The Paradise Movie Release Delay: మీడియం రేంజ్ హీరోలు చేస్తున్న పాన్ ఇండియన్ సినిమాల్లో , నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) హీరో గా నటిస్తున్న ‘ది ప్యారడైజ్'(The Paradise Movie) చిత్రం పై అటు అభిమానుల్లో , ఇటు ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నాని గెటప్, సినిమా బ్యాక్ డ్రాప్ , రీసెంట్ గా విడుదలైన ‘ఆయా షేర్’ సాంగ్ , ఇలా ప్రతీ […]

The Paradise Movie Release Delay: మీడియం రేంజ్ హీరోలు చేస్తున్న పాన్ ఇండియన్ సినిమాల్లో , నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) హీరో గా నటిస్తున్న ‘ది ప్యారడైజ్'(The Paradise Movie) చిత్రం పై అటు అభిమానుల్లో , ఇటు ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నాని గెటప్, సినిమా బ్యాక్ డ్రాప్ , రీసెంట్ గా విడుదలైన ‘ఆయా షేర్’ సాంగ్ , ఇలా ప్రతీ ఒక్కటి కూడా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఆయా షేర్ పాటకు అయితే అప్పుడే 100 మిల్లియన్లకు పైగా వ్యూస్ రావడం గమనార్హం. స్టార్ హీరోల సినిమాల పాటలకు తప్ప , మీడియం రేంజ్ హీరోల పాటలకు ఇంత తొందరగా , ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం అనేది గతం లో ఎప్పుడూ జరగలేదు. ఆ రేంజ్ సెన్సేషనల్ బజ్ జనాల్లో ఈ చిత్రం పై క్రియేట్ అయ్యింది.

ప్లాన్ ప్రకారం షూటింగ్ జరిగి ఉండుంటే ఈ చిత్రం కచ్చితంగా మార్చి 26 న ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మేకింగ్ కోసం చాలా ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు. నాని కూడా ee విషయం లో కాస్త అసంతృప్తికి గురైనట్టు , శ్రీకాంత్ పై అసహనం వ్యక్తం చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపించాయి. అయితే మార్చి 26 నుండి ఆగస్టు 24 కి వాయిదా పడిన ఈ చిత్రం , ఇప్పుడు ఆ తేదీన రావడం కూడా అసాధ్యం అని తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు డిసెంబర్ నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నట్టు వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు డిసెంబర్ లో కూడా కష్టమని అంటున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ నెలకు విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారట ప్రస్తుతానికి మేకర్స్.

పదే పదే శ్రీకాంత్ రీ షూట్స్ కి వెళ్లడం వల్లే, ఇంత ఆలస్యం జరుగుతుందని సమాచారం. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కనీసం 50 శాతం కూడా పూర్తి అవ్వలేదట. దీనిని బట్టీ శ్రీకాంత్ టేకింగ్ ఎంత నిదానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సినిమా ప్రారంభానికి ముందే బడ్జెట్ ని 150 కోట్ల రూపాయలకు ఫిక్స్ చేశారు. ఇప్పుడు అది 200 కోట్ల మార్కుని దాటేసింది. నాని మార్కెట్ ఏమో కనీసం వంద కోట్ల రూపాయిల రేంజ్ లో కూడా లేదు. ఇలా రీ షూట్స్ చేయడం, బాగా సమయం తీసుకోవడం తో మేకింగ్ కాస్ట్ ఇప్పుడు 250 కోట్లకు చేరినట్టు సమాచారం. ఒక రేంజ్ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్ప ఈ సినిమా గట్టెక్కడం కష్టం , అలాంటిది ఇన్ని సార్లు వాయిదా పడుతూ వస్తోంది , ఆడియన్స్ లో నెమ్మదిగా ఆసక్తి పోయే ప్రమాదం కూడా ఉంది. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper