విరాట్ కోహ్లీ: గొప్ప ఆటగాడు.. కానీ గొప్ప కెప్టెన్ కాదు!

కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు ఇప్పుడు ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమికి ఎన్నో కారణాలు.. అన్నింటిని పక్కనపెడితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక విఫల కెప్టెన్ ప్రయోగం అని చెప్పడంలో ఈ అపజయం తార్కాణం అని చెప్పకతప్పదు. విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలయమ్స్ సన్ ఇద్దరూ అండర్ 19 జట్ల కెప్టెన్ల నుంచి టీమిండియా కెప్టెన్లుగా వచ్చినవారే. కానీ న్యూజిలాండ్ కెప్టెన్ ఎంతో కూల్ గా […]

Written By: NARESH, Updated On : June 24, 2021 11:22 am
Follow us on

కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు ఇప్పుడు ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమికి ఎన్నో కారణాలు.. అన్నింటిని పక్కనపెడితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక విఫల కెప్టెన్ ప్రయోగం అని చెప్పడంలో ఈ అపజయం తార్కాణం అని చెప్పకతప్పదు.

విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలయమ్స్ సన్ ఇద్దరూ అండర్ 19 జట్ల కెప్టెన్ల నుంచి టీమిండియా కెప్టెన్లుగా వచ్చినవారే. కానీ న్యూజిలాండ్ కెప్టెన్ ఎంతో కూల్ గా ఆటగాడిగా.. జట్టును ముందుండి నడిపించడంలో మెరుగయ్యాడు. విరాట్ మాత్రం అగ్రెసివ్ తో జట్టును ఫైనల్ చేర్చడం.. ఆ ఫైనల్ లో తుస్సుమనడం ఇలా కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీని గెలవలేదంటే అతడొక ‘విఫల కెప్టెన్’ అని చెప్పక తప్పదు.

ఒక మేటి ఆటగాడు గొప్ప కెప్టెన్ కావాలనేమీ లేదు. విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడు. ప్రపంచంలోనే మేటి ఆటగాడు. పరుగుల వీరుడు. అత్యధిక పరుగులు తీసి ప్రపంచంలోనే నంబర్ 1గా ఉన్నాడు. అయితే జట్టును నడిపించే ఆటగాడిగా మాత్రం కోహ్లీ ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. కెప్టెన్ గా ఇంతవరకు ఒక్క ఐసీసీ ట్రోఫీని కోహ్లీ ముద్దాడలేదంటే అతడి వైఫల్యాన్ని మనం చూడొచ్చు.

ఇదే సమయంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలయంసన్ మంచి ఆటగాడు మాత్రమే కాదు.. ఒక గొప్ప కెప్టెన్ కూడా.. చాలా ప్రశాంతంగా ఉంటాడు. నిలకడకూ.. నిబ్బరానికి మారుపేరుగా ఉంటాడు. ఈరోజు మాత్రమే కాదు.. 2019 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లోనూ ఇంగ్లండ్ మీద ఆడుతున్నప్పుడు అంతటి క్లిష్ట పరిస్థితుల్లో విలయమ్స్ సన్ ఎంత నిబ్బరంగా ఉన్నాడో చూశాం.

అందరిపై గెలిచి ఫైనల్ చేరిన ఇండియా ఓటమి క్రికెట్ ఫ్యాన్స్ ను ఎంతో బాధపెట్టింది. అయితే ఈ విజాయానికి మాత్రం న్యూజిలాండ్ పూర్తి అర్హత ఉంది. ఆ జట్టు భారత్ కంటే గొప్పగా ఆడింది. అందుకే విజయం వరించింది. కనీసం ఆఫ్ సెంచరీ చేయలేని టీమిండియా ఆటగాళ్లు న్యూజిలాండ్ కు కప్ ను చేతిలో పెట్టేశారు. ఈ ఓటమితోనైనా టీమిండియా పగ్గాలు కోహ్లీ నుంచి తప్పించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. మరి ఆటగాడుగా హిట్ అయిన కోహ్లీ కెప్టెన్ గా ఫెయిల్ అని తేలిపోయింది. కోహ్లీ తనకు తానే తప్పుకుంటాడా? తప్పిస్తారా? అన్నది వేచిచూడాలి.

ధోని కెప్టెన్ కాగా టీ20 కప్ తెచ్చిపెట్టాడు. ఆ తర్వాత చాంపియన్స్ ట్రోపీ, వన్డే వరల్డ్ కప్, టెస్ట్ చాంపియన్ షిప్.. కెప్టెన్ గా అన్నీ సాధించి తన వారుసుడిగా కోహ్లీని ఎంపిక చేసి తప్పుకున్నాడు.. కానీ ఇప్పుడు కోహ్లీ సారథ్యంలో టీమిండియా ఏ ప్రపంచకప్ సాధించలేదు. అయినా కూడా ఆ పదవిని పట్టుకునే కోహ్లీ వేలాడుతున్నాడు. వచ్చే టీ20 ప్రపంచకప్ కైనా తప్పుకొని ‘ముంబై ఇండియన్స్ ’ను ఐదు సార్లు విజేతగా నిలిపిన రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.