వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిననాటి నుంచి రాష్ట్రానికి ఆదాయం లేకపోయినా రకరకాల పేర్లతో డబ్బులు పంచుతున్నారని కేవలం ఓట్ల కోసం మాత్రమే అప్పులు తెచ్చి మరీ పప్పుల- బెల్లం పంచుతన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. ఏ ప్రభుత్వం అయిన తమ ప్రజలకు చేతినిండా పనిని కల్పించి, వారి పనికి తగ్గ వేతనాన్ని చెల్లించేలా చూసి వారి కుటుంబాలు ఆర్థికంగా ఎదగడం పై దృష్టి పెట్టాడతాయి. కానీ జగన్ వీటన్నిటికీ భిన్నంగా పరిపాలనను గాలికి వదిలేసి, ప్రజలకు పని కల్పించడం మానేసి, నేరుగా డబ్బులు పంచడం పైనే పూర్తి దృష్టి కేటాయించారని విమర్శించారు.