https://oktelugu.com/

Director Shankar: ఇలాంటి దారుణమైన రివ్యూస్ వస్తాయని ఊహించలేదంటూ కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్ శంకర్..’గేమ్ చేంజర్’ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు!

1996 వ సంవత్సరం లో విడుదలైన 'ఇండియన్' చిత్రానికి ఇది సీక్వెల్. తెలుగు లో భారతీయుడుగా ఈ చిత్రాన్ని అనువదిస్తే, ఇక్కడ కూడా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ముఖ్యంగా సేనాపతి క్యారక్టర్ ని శంకర్ తీర్చి దిద్దిన తీరుని చూస్తే రోమాలు నిక్కపొడుచుకుంటాయి.

Written By:
  • Vicky
  • , Updated On : December 19, 2024 / 06:57 PM IST

    Director Shankar

    Follow us on

    Director Shankar: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో రాజమౌళి కంటే ముందే పాన్ వరల్డ్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శంకర్. 2010 వ సంవత్సరం వరకు శంకర్ మాత్రమే ఇండియా లో టాప్ మోస్ట్ డైరెక్టర్. రాజమౌళి మగధీర సినిమాతో శంకర్ కి పోటీ వచ్చినప్పటికీ, శంకరే టాప్. కానీ రోబో తర్వాత శంకర్ నుండి సరైన దమ్ము ఉన్న సినిమా రాలేదు. ‘2 పాయింట్ O’ చిత్రం కమర్షియల్ గా భారీ వసూళ్లను రాబట్టింది కానీ, డైరెక్టర్ గా మాత్రం శంకర్ రేంజ్ సినిమా ఇది కాదని విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ శంకర్ బ్రాండ్ ఇమేజ్ కి ఎలాంటి కలంకం రాలేదు. ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో అయినా ఆయన భారీ కం బ్యాక్ ఇస్తాడని ప్రేక్షకులు, అభిమానులు ఆశించారు. కానీ ఈ ఏడాది ఆయన నుండి విడుదలైన ‘ఇండియన్ 2’ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.

    1996 వ సంవత్సరం లో విడుదలైన ‘ఇండియన్’ చిత్రానికి ఇది సీక్వెల్. తెలుగు లో భారతీయుడుగా ఈ చిత్రాన్ని అనువదిస్తే, ఇక్కడ కూడా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ముఖ్యంగా సేనాపతి క్యారక్టర్ ని శంకర్ తీర్చి దిద్దిన తీరుని చూస్తే రోమాలు నిక్కపొడుచుకుంటాయి. అలాంటి క్లాసిక్ చిత్రానికి సీక్వెల్ అంటే ఏ రేంజ్ లో ఉండాలి అనుకుంటామో, ఆ రేంజ్ లో ఈ సినిమా లేదు. పైగా సేనాపతి క్యారక్టర్ ని శంకర్ కామెడీ చేసి పారేసాడు. అసలు ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించాడా అనే అనుమానాలు కూడా అభిమానుల్లో వ్యక్తం అయ్యాయి. అయితే ఈ చిత్రం ఫలితం పై మొట్టమొదటిసారి శంకర్ ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో స్పందించాడు. ఆయన మాట్లాడుతూ ‘ఇండియన్ 2 చిత్రానికి ఆ స్థాయి నెగటివ్ రివ్యూస్ వస్తుందని ఊహించలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.

    ఇంకా ఆయన మాట్లాడుతూ ‘జరిగిందేదో జరిగిపోయింది. ఆ ఫలితాన్ని నేను మార్చలేను. కానీ నేను రామ్ చరణ్ తీసిన గేమ్ చేంజర్ చిత్రం అద్భుతంగా వచ్చింది. రామ్ చరణ్ కెరీర్ లో చిరస్థాయిగా గుర్తుండిపోయే క్యారక్టర్ అది. స్టైల్, మాస్, యాక్షన్, సెంటిమెంట్, డ్యాన్స్ ఇలా అన్ని ఎమోషన్స్ లో ఆయన అల్లాడించాడు. ఇటీవలే సినిమా ఫైనల్ ఔట్పుట్ ని చూసాను. చాలా సంతృప్తిని ఇచ్చింది. కచ్చితంగా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుంది’ అని చెప్పుకొచ్చాడు. అదే విధంగా ‘ఇండియన్ 3’ గురించి ఆయన మాట్లాడుతూ ‘ఈ చిత్రం ఇండియన్ 2 లాగ మిమ్మల్ని నిరాశ పర్చదు. చాలా అద్భుతంగా వచ్చింది ఔట్పుట్. చాలామంది ఈ సినిమాని ఓటీటీ లో విడుదల చేస్తున్నాం అని దుష్ప్రచారాలు చేసారు. అందులో ఎలాంటి నిజం లేదు. ఈ చిత్రం థియేటర్స్ లో మాత్రమే విడుదల అవుతుంది’ అని చెప్పుకొచ్చాడు శంకర్. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.