Virat Kohli: ఎన్నో అంచనాల మధ్య విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ బరిలోకి దిగాడు. అయితే ఆశించినంత స్థాయిలో అతడు బ్యాటింగ్ చేయలేకపోయాడు.. సింగిల్ డిజిట్ స్కోర్ కే అతడు అవుట్ అయ్యాడు. దీంతో విరాట్ అభిమానులు మొత్తం నిరాశకు గురయ్యారు. విరాట్ చాలా రోజుల తర్వాత రంజి క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో.. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ప్రేక్షకులకు ఉచితంగా మ్యాచ్ చూసే అవకాశాన్ని కల్పించింది. దీంతో విరాట్ కోహ్లీ చూడ్డానికి అభిమానులు భారీగా బారులు తీరారు. వేలాదిమంది అరుణ్ జైట్లీ మైదానానికి పోటెత్తారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాలలో సంచలనం సృష్టించాయి. అయితే విరాట్ కోహ్లీ రైల్వేస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో విఫలమయ్యాడు.. ఈ క్రమంలో అతడి ఫామ్ పై స్పోర్ట్స్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇటీవల కాలంలో విరాట్ కోహ్లీ సరైన ఇన్నింగ్స్ ఆడటం లేదు. ముఖ్యంగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తో జరిగిన సిరీస్ లలో విఫలమయ్యాడు. దీంతో బిసిసిఐ తెరపైకి కఠిన నిబంధనలను తెరపైకి తీసుకురావడంతో.. రంజీ లో బరిలోకి దిగాడు. విరాట్ కోహ్లీ కంటే ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రంజి లో ముంబై జట్టు తరఫున బరిలోకి దిగాడు. అతడు కూడా విఫల ప్రదర్శన చేశాడు. జమ్ము కాశ్మీర్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు.
విరాట్ కోహ్లీకి ఎంతిస్తున్నారంటే
ఫామ్ తో సంబంధం లేకుండా విపరీతమైన పాపులారిటీ ఉంటుంది.. ఢిల్లీలో జరిగిన రంజీ మ్యాచ్లో అది నిరూపితమైంది. రంజి ఆడుతున్న విరాట్ కోహ్లీకి రోజుకు 60,000 వరకు జీతం ఇస్తున్నారు. మ్యాచ్ జరిగే నాలుగు రోజుల్లో 2,40,000 పారితోషకం లభిస్తుంది. రంజీలలో 40 మ్యాచ్లకు పైగా ఆడిన ఆటగాడికి రోజుకు 60 వేల చొప్పున ఇస్తారు. 21 నుంచి 40 మ్యాచులు ఆడిన అనుభవం ఉన్న ఆటగాడికి రోజుకు 50 వేల పారితోషకం ఇస్తారు. 20 కంటే తక్కువ మ్యాచులు ఆడితే 40 వేలు ఇస్తారు. ఎంట్రీ ప్లేయర్ కు 20వేల వరకు పారితోషికం ఇస్తారు. అయితే విరాట్ సరిగా ఆడక పోవడంతో అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొంతమందయితే రిటర్మెంట్ కు సమయం దగ్గర పడిందని.. ఇక ఆ నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు..” విరాట్ అంతర్జాతీయ మ్యాచ్ లలోనే కాదు.. దేశీయ మ్యాచ్ లలో కూడా విఫలమవుతున్నాడు. అనామక బౌలర్ల చేతిలో అవుట్ అవుతున్నాడు. ఇలా అయితే కెరియర్ జోరుగా కొన సాగడం కష్టమే. అందువల్లే విరాట్ త్వరగా క్రికెట్ కు గుడ్ బై చెప్పడం మంచిది. ఇప్పటికే t20కి అతడు వీడ్కోలు పలికాడు. టెస్ట్, వన్డే ఫార్మాట్ లకు కూడా గుడ్ బై చెబితే బాగుంటుందని” కొంతమంది నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.