Homeఎంటర్టైన్మెంట్Rashmika Mandanna : పబ్లిక్ లో స్టార్ హీరోకి టీచర్ గా మారిన రష్మిక, ఎంత...

Rashmika Mandanna : పబ్లిక్ లో స్టార్ హీరోకి టీచర్ గా మారిన రష్మిక, ఎంత క్యూట్ గా నేర్పుతుందో చూడండి! వీడియో వైరల్

Rashmika Mandanna :  రష్మిక మందాన బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ హోదా రాబట్టింది. ఈ కన్నడ భామ నటించిన యానిమల్ మూవీ రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. హిందీలో యానిమల్ మూవీ రష్మికకు మొదటి హిట్. ఈ మూవీలో ఆమె ఘాటైన రొమాంటిక్ సన్నివేశాల్లో నటించారు. తాజాగా పుష్ప 2తో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ కొట్టింది. పుష్ప 2 అక్కడి టాప్ స్టార్స్ నమోదు చేసిన భారీ రికార్డ్స్ లేపేసింది. పుష్ప 2లో అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందాన నటించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో హిందీలో రష్మికకు ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. స్టార్ హీరోలు, దర్శకులు ఆమె డేట్స్ కోసం ఎగబడుతున్నారు. విక్కీ కౌశల్ హీరోగా నటించిన పీరియాడిక్ వార్ డ్రామా చావాలో రష్మిక మందాన హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కానుంది. చావా పాన్ ఇండియా చిత్రంగా పలు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. చావా ప్రమోషన్స్ లో భాగంగా విక్కీ కౌశల్ హైదరాబాద్ వచ్చారు. ఆయనతో రష్మిక మందాన జాయిన్ అయ్యింది.

చావా ప్రమోషనల్ ఈవెంట్లో.. విక్కీ కౌశల్ తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేశాడు. తెలుగు ఆయనకు రాదు, ఈ క్రమంలో రష్మిక మందాన నేర్పింది. ఆ క్షణంలో రష్మిక.. విక్కీ కౌశల్ కి టీచర్ గా మారింది. రష్మిక మందాన చెబుతుంటే… విక్కీ కౌశల్ తెలుగు పదాలు పలికారు. రష్మిక మందాన-విక్కీ కౌశల్ ల ఈ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా చావా చిత్రంలో ఛత్రపతి శంభాజీ మహరాజ్ పాత్రను విక్కీ కౌశల్ చేశాడు. ఇక మహారాణి యేసుబాయ్ పాత్రలో రష్మిక మందాన కనిపించనుంది.

చావా చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకుడు. చావా ట్రైలర్ ఆకట్టుకోగా అంచనాలు పెరిగాయి. విక్కీ కౌశల్ నటన, ట్రాన్స్ఫర్మేషన్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక రష్మిక మందాన విషయానికి వస్తే… సల్మాన్ ఖాన్ కి జంటగా సికిందర్ టైటిల్ తో మరో భారీ బాలీవుడ్ మూవీ చేస్తుంది. మురుగదాస్ ఈ చిత్రానికి దర్శకుడు. రంజాన్ కానుకగా విడుదల కానుంది

RELATED ARTICLES

Most Popular