
ఐపీఎల్ తొలి మ్యాచ్ ను బెంగుళూరు సొంతం చేసుకుంది. పేరుకు ఐపీఎల్ మ్యాచ్ అయినా ఎంతో ఉత్కంఠంగా సాగింది పోరు. ప్రతీ బాల్ ఎవరికి సొంతం అవుతుందోనన్న ఉత్కంఠతో చూశారు క్రికెట్ ఫ్యాన్స్. మొత్తానికి మొదటి మ్యాచ్ ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సందర్భంగా మ్యాచ్ జరిగిన తీరు కెప్టెన్ విరాట్ కోహ్లి వివరించారు. ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
‘టోర్నీ ప్రారంభంలో గెలవడం చాలా కీలకం. ఈ మొదటి మ్యాచ్ లో చివరి వరకు విరోచితంగా పోరాడాం. మాకు మొదటి మ్యాచ్ గెలిచిన అనందం ఉన్నా.. మరికొన్ని పరుగులు చేయాల్సి ఉంది. అయితే కొన్ని మిస్టేక్స్ చేశాం. అందుకే అనుకున్నవి చేయలేకపోయాం.. రోహిత్ ఔటయ్యాక మంబయ్ లో మిగత ఆటగాళ్ల జోరు పెంచారు. హర్షల్ పటేల్ మా జట్టులో డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా కొనసాగుతాడు. ఇప్పుడు అదే చేశాడు.
జేమీసన్, యూజీ, సిరాజ్ అనుకున్న స్థాయిలో బౌలింగ్ చేశారు. మాక్సీని నాలుగో స్థానంలో దించగా అతడు 10 నుంచి 15 బంతుల్లోనే తన ప్రతిభను చూపాడు. అతడి ఆటను చూశాక ప్రత్యర్థి జట్టు కొంత ఆందోళన చెందింది. చాలా మంది ఈ పిచ్ పై ఇబ్బంది పడుతారు. కానీ మాక్సీ ఆటలో మాత్రం అదేమీ కనిపించలేదు. ఇక మార్క్ జాన్సన్ ఎలాంటి పరిస్థితుల్లోనైనా బౌలింగ్ చేయగలుగుతాడు. అయితే ఏబీ, క్రిస్టియన్ భాగస్వామ్యం గురించి అందికి తెలిసిందే. అందుకే బుమ్రా, బౌల్డ్ ను ప్రయోగించాం.
ఈ మ్యాచ్ గెలవడం అంత తేలిక కాదని తెలుసు. కానీ చివరి వరకు గెలుస్తామన్న భావనతో ఉన్నాం. నేను రనౌట్ అయిన బంతిని కృనాల్ అద్భుతంగా విసిరాడు. అలాంటి వారితో ఆడి మ్యాచ్ ను గెలిపించడం కష్టం. అయితే మాకు డాన్ క్రిస్టియన్ ఉన్నాడన్న ధీమా ఉంది. అయితే పిచ్ ను చూస్తే భయం వేసింది. అయినా మొత్తానికి ఛేదించగలిగాం..’