స్టార్ డైరెక్టర్ కి అవమానం.. బాలయ్య మౌనం !

డైరెక్షన్ అంటేనే ఒక వ్యక్తి అభిరుచి. సినిమా ఎలా ఉండాలి, ఏ అంశం ఎంత ఉండాలి.. ఇలాంటి విషయాలను డిసైడ్ చేయాల్సిన వ్యక్తి డైరెక్టరే. అందుకే ప్రతీ దర్శకుడికీ ఒక స్టైల్ ఉంటుందనే, స్టార్ హీరోలు కూడా, తమకు తెలిసినా డైరెక్షన్ లో వేలు పెట్టరు. కొంతమంది తెలివి లేని హీరోలు ‘కాలు’ కూడా పెడతారు లేండి, అది వేరే సంగతి. డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటే.. ప్రతి డైరెక్టర్ కి ఒక స్ట్రాంగ్ జోనర్ ఉంటుంది. ఆ […]

Written By: admin, Updated On : April 10, 2021 10:54 am
Follow us on


డైరెక్షన్ అంటేనే ఒక వ్యక్తి అభిరుచి. సినిమా ఎలా ఉండాలి, ఏ అంశం ఎంత ఉండాలి.. ఇలాంటి విషయాలను డిసైడ్ చేయాల్సిన వ్యక్తి డైరెక్టరే. అందుకే ప్రతీ దర్శకుడికీ ఒక స్టైల్ ఉంటుందనే, స్టార్ హీరోలు కూడా, తమకు తెలిసినా డైరెక్షన్ లో వేలు పెట్టరు. కొంతమంది తెలివి లేని హీరోలు ‘కాలు’ కూడా పెడతారు లేండి, అది వేరే సంగతి. డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటే.. ప్రతి డైరెక్టర్ కి ఒక స్ట్రాంగ్ జోనర్ ఉంటుంది. ఆ జోనర్ లో ఎమోషన్ ను పండించడంలో ఆ దర్శకుడికి కచ్చితంగా నేర్పు ఉంటుంది. అందుకే ఆ దర్శకుడు ఆ జోనర్ కి ప్రత్యేక బలం అవుతాడు. అయితే ఒక్కోసారి తన బలమే, బలహీనతగా మారితే.. ఆ డైరెక్టర్ పరిస్థితి ఏమిటి ?

మాస్ డైరెక్టర్ గా బోయపాటి శ్రీనుకి జనంలో మంచి క్రేజ్ ఉంది. ఇండస్ట్రీలో కూడా మంచి పేరు ఉంది, దానికి తగ్గట్లుగానే మంచి డిమాండ్ కూడా ఉంది. అందుకే బోయపాటి అంటేనే మాస్ చిత్రాల దర్శకుడు అనే బ్రాండ్ క్రియేట్ అయిపొయింది. ఒక హీరో యొక్క హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో బోయపాటి తర్వాతే ఎవరైనా అని చెప్పేవాళ్ళు ఒకప్పుడు. కాకపోతే ఇప్పుడు పరిస్థితి మారినట్టు కనిపిస్తోంది. బోయపాటి తీస్తోన్న మాస్ సన్నివేశాలు లాజిక్ కి దూరంగా ఉంటున్నాయని అతన్ని నమ్మడం మానేశారు నిర్మాతలు.

ప్రస్తుతం బాలయ్య బాబుతో తీస్తోన్న సినిమాకి కూడా ఇదే జరిగింది. ఆ సినిమా నిర్మాత రవీంద్ర రెడ్డి బోయపాటి పై సెట్ లో సీరియస్ అయినట్టు తెలుస్తోంది. అనవసరంగా యాక్షన్ ను పెట్టొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా.. ఎందుకు వినిపించుకోవడం లేదు, ఈ విషయంలో మీకు అసలు బుద్ది లేదు అంటూ బోయపాటిని అందరి ముందు కడిగిపారేశాడట నిర్మాత. అయితే నిర్మాత సీరియస్ వెనుక మరో విషయం దాగి ఉంది. ఒక యాక్షన్ సీన్ కోసం బోయపాటి ఏభై లక్షలు ఖర్చు పెట్టించాడు. ఆ కోపాన్ని మనసులో పెట్టుకునే నిర్మాత రెచ్చిపోయినట్టు ఉన్నాడు.

పాపం ‘వినయ విధేయ రామ’ దెబ్బకు బోయపాటి భారీ డిజాస్టర్ డైరెక్టర్ గా మిగిలిపోయాడు. బోయపాటికి ప్రస్తుతం బాలయ్య సపోర్ట్ కూడా లేదు అనుకుంటా. బోయపాటిని అందరి ముందు తిట్టి అవమానిస్తున్నా.. బాలయ్య కూడా చూసి చూడనట్టు ఉండిపోయాడట.