Virat Kohli Business: డబ్బు ఊరికే రాదు. దానిని సంపాదించడానికి కష్టపడాలి. ఇబ్బంది పడాలి. అనేకరకాల ఆటుపోట్లు ఎదుర్కోవాలి. అప్పుడే డబ్బు అనేది మన సొంతమవుతుంది. ఒక్కసారి డబ్బు సంపాదించడం మొదలు పెడితే.. ఆ తర్వాత రకరకాల మార్గాలను అన్వేషించవచ్చు. మరింత డబ్బును సంపాదించవచ్చు. డబ్బులు సంపాదించే క్రమంలో దానిని రెట్టింపు చేసుకోవడం విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. అలాంటి వారికి విరాట్ కోహ్లీ అనుసరిస్తున్న విధానం.. ఒక విలువైన వ్యాపార సూత్రం.
Also Read: క్రికెట్ లో ఈ కాలపు నయా వాల్.. చటేశ్వర్ పూజార కీలక నిర్ణయం..
విరాట్ కోహ్లీ స్టార్ ఆటగాడు. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. అతడు రెండు చేతులా సంపాదిస్తాడు. అద్భుతమైన క్రికెటర్ గా పేరు తెచ్చుకున్న తర్వాత విరాట్ కోహ్లీ తన సంపాదనను మరో స్థాయికి తీసుకెళ్లాడు.. బీసీసీఐ ద్వారా వచ్చే వార్షిక కాంటాక్ట్ మాత్రమే కాదు.. ఐపీఎల్ లో బెంగళూరు జట్టు తరపున వచ్చే 21 కోట్లు మాత్రమే కాదు.. ఇంకా అనేక రూపాలలో అతడికి డబ్బు సమకూరుతోంది. అతడు సామాజిక మాధ్యమాలలో ఒక్క పోస్ట్ పెడితే చాలు కోట్లలో నగదు వచ్చి వాళ్ళతో ఉంటుంది.. సంపాదన మాత్రమే కాదు.. పెట్టుబడి విషయంలోనూ విరాట్ కోహ్లీ తోపు. అతడు బ్లూ ట్రైబ్, రేజ్ కాఫీ, హైపరైస్, డిజిట్ ఇన్సూరెన్స్, చి సెల్ ఫిట్నెస్, యూనివర్సల్ స్పోర్ట్స్ బిజ్, రోన్, ఎఫ్ సీ గోవా వంటి వాటిల్లో అతడు పెట్టుబడులు పెట్టాడు.. అజలి టాస్ అనే స్పోర్ట్స్ వేర్ బ్రాండ్లో దాదాపు 40 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాడు. వీటి ద్వారా విరాట్ కోహ్లీకి దండిగా ఆదాయం వస్తూ ఉంటుంది. విరాట్ కోహ్లీకి మొబైల్ ప్రీమియర్ లీగ్ లో కొన్ని సంవత్సరాల క్రితం భాగస్వామ్యం ఉండేది. ఇప్పుడు అది యూనికార్న్ స్థాయికి చేరుకున్నది.. విరాట్ కోహ్లీకి ఇన్ స్టా గ్రామ్ లో 27 కోట్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అతడు ఒక పోస్ట్ పెడితే చాలు 12 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ట్విట్టర్ ఎక్స్ లో 2.5 కోట్లు లభిస్తాయి.
ఐపీఎల్ లో బెంగుళూరు జట్టుకు ఆడుతున్నాడు కాబట్టి ప్రతి ఏడాది అతనికి 21 కోట్ల రూపాయల ఫీజు లభిస్తుంది. ఇది మాత్రమే కాకుండా మ్యాచ్ బోనస్, సెంటు కూడా అందుతాయి.. వన్ 8 పేరుతో విరాట్ కోహ్లీకి రెస్టారెంట్లు ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, కోల్ కతా, పూణే, బెంగళూరు, హైదరాబాద్ నగరాలలో ఈ రెస్టారెంట్లు ఉన్నాయి.. ఈ మాత్రమే కాకుండా రోన్ ఫ్యాషన్ బ్రాండ్ పేరుతో కంపెనీ కూడా ఉంది.. సూపర్ లీగ్ ఫుట్ బాల్ టోర్నీలో ఎఫ్ సీ గోవా జట్టుకు సహ యజమానిగా కొనసాగుతున్నాడు. వీటి ద్వారా విరాట్ కోహ్లీకి ప్రతి ఏడాది 40 కోట్ల వరకు ఆదాయం లభిస్తూ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే విరాట్ కోహ్లీ సంపాదనకు అంతు పొంతు ఉండదు. తను ఒక సూపర్ క్రికెటర్. అడుగు నేల మీద పడితే చాలు డబ్బే డబ్బు. అయినప్పటికీ విరాట్ కోహ్లీ నిశ్శబ్దంగా ఉండలేదు. ఈ పేరు.. ఈ కీర్తి ఏదో ఒక రోజు ఫేడ్ అవుట్ అవుతున్నాయని అతడికి తెలుసు. అందువల్లే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నాడు. అదే సూత్రాన్ని పాటిస్తూ తిరుగులేని కోటీశ్వరుడు గా మారిపోయాడు.