India vs Australia : అడిలైడ్ వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియా పట్టు సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ ను 180 పరుగులకు ఆల్ అవుట్ చేసిన ఆస్ట్రేలియా.. తొలి ఇన్నింగ్స్ లో 337 రన్స్ చేసింది. తద్వారా 157 పరుగుల లీడ్ సంపాదించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ సెంచరీ చేశాడు. 141 బంతుల్లో 140 పరుగులు చేసి అదరగొట్టాడు.. ప్రారంభంలో నిదానంగా ఆడిన హెడ్.. ఆ తర్వాత తన అసలు విశ్వరూపం చూపించాడు. బుమ్రా మినహా మిగతా అందరి బౌలింగ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ముఖ్యంగా సిరాజ్ బౌలింగ్లో దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. అతడివేసిన 82 ఓవర్లో మొదటి బాల్ ను ఫోర్ గా మలచిన హెడ్.. రెండవ బంతిని భారీ సిక్స్ కొట్టాడు. అయితే తాను వేసిన వైవిధ్యవంతమైన బంతులను అలా ఫోర్, సిక్స్ కొట్టడాన్ని సిరాజ్ తట్టుకోలేకపోయాడు. “అసలు ఎందుకిలా జరుగుతోంది.. అతడు అలా ఎలా ఆడుతున్నాడు” అన్నట్టుగా తన ఫేస్ ఫీలింగ్ ను ప్రదర్శించాడు. ఈ నేపథ్యంలో దెబ్బతిన్న బెబ్బులి లాగా సిరాజ్ మూడో బంతిని వేశాడు. ఈసారి దానిని యార్కర్ గా సంధించాడు. అయితే దానిని కూడా భారీ షాట్ కొట్టడానికి హెడ్ ప్రయత్నించాడు. అయితే బంతి మిస్సై వికెట్లను పడగొట్టింది. ఫలితంగా హెడ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అతడు అవుట్ కావడంతో టీమిండియా ఆటగాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. హెడ్ అవుట్ కాగానే సిరాజ్ ఎగిరి గంతేశాడు. అంతే కాదు భీకరంగా ముఖాన్ని పెట్టాడు. ఏ హే మైదానం నుంచి వెళ్ళిపో అన్నట్టుగా మాట్లాడాడు. సిరాజ్ ఆ తరహా ముఖ కవళికలు, సంభాషణలను పలకడంతో హెడ్ బిత్తర పోయాడు. దీనికి సంబంధించిన వీడియోను స్టార్ స్పోర్ట్స్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. హే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ దానికి ట్యాగ్ లైన్ ఇచ్చి.. మూతి మూసుకున్న కోతి ఎమోజిని పోస్ట్ చేసింది. ఇలాంటి మాటలు వినకూడదు అన్నట్టుగా కోతి ఏమోజి ద్వారా చెప్పే ప్రయత్నం చేసింది.
శుక్రవారం కూడా ఆగ్రహం
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ప్రారంభమైన శుక్రవారం కూడా సిరాజ్ ఇదేవిధంగా తన ఆగ్రహాన్ని ప్రదర్శించాడు. సిరాజ్ బౌలింగ్ వేస్తుండగా స్ట్రైకర్ గా లబూ షేన్ బంతిని ఆపమని సైగ చేశాడు. కానీ సిరాజ్ ఆగిపోయి.. పట్టరాని కోపంతో బంతిని అలా లబూ షేన్ వైపు విసిరేశాడు. తన కంటికి ఎదురుగా ఉన్న స్క్రీన్ లో అభిమాని అటు ఇటు కదలడంతో లబూ షేన్ తన లయను కోల్పోయాడు. దీంతో బంతిని ఆపమని సిరాజ్ కు సైగ చేశాడు. లబు షేన్ చేసిన పనికి సిరాజ్ కు కోపం వచ్చింది. వెంటనే ఆ బంతిని వికెట్ల వైపు విసిరేశాడు. సిరాజ్ చేసిన పని పట్ల క్రికెట్ అభిమానులు మండిపడ్డారు. ” ఇంత పట్టరాని ఆగ్రహం ఏంటి? కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి కదా? లబూ షేన్ చెప్పినప్పుడు వినాలి కదా?” అంటూ చురకలంటించారు. మరోవైపు శనివారం ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లోనూ హెడ్ అవుట్ అయినప్పుడు సిరాజ్ పట్టరాని ఆగ్రహాన్ని ప్రదర్శించాడు. మొత్తంగా రెండు రోజులు తన హావాభావాలతో సిరాజ్ టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయాడు.
A series of events! #MohammedSiraj has the last laugh as he castles the centurion #TravisHead after being hit for a six!
P.S: Don’t miss DSP’s send off at the end! #AUSvINDOnStar 2nd Test LIVE NOW on Star Sports! #AUSvIND | #ToughestRivalry pic.twitter.com/K2sRrWy0Mj
— Star Sports (@StarSportsIndia) December 7, 2024