Allu Arjun బాహుబలి తర్వాత మన టాలీవుడ్ లో సమీకరణాలు చాలా మారాయి. మెగాస్టార్ చిరంజీవి తర్వాత టాలీవుడ్ నెంబర్ 1 హీరో ఎవరు అనే దానిపై చాలా సంవత్సరాలు చర్చలు నడిచేవి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’, ‘అత్తారింటికి దారేది’ వంటి ఇండస్ట్రీ హిట్స్ తో క్రేజ్ లో, ఫ్యాన్ ఫాలోయింగ్ లో ఈ తరం హీరోలలో నెంబర్ 1 హీరోగా నిలిచాడు. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల వరకు పవన్ కల్యాణే నెంబర్ 1. అయితే ఇప్పుడు పెరిగిన పాన్ ఇండియా మార్కెట్ లో నెంబర్ 1 హీరో ఎవరు అనేదానిపై చర్చలు నడుస్తున్నాయి. రాజమౌళి తప్ప పాన్ ఇండియా లెవెల్ లో ఎవ్వరూ బ్లాక్ బస్టర్స్ కొట్టలేరు కాబట్టి, రాజమౌళినే నెంబర్ 1 అని అందరూ అనుకున్నారు. ఆయన తర్వాత ప్రభాస్ కి మాత్రమే ఆ రేంజ్ ఉందని కూడా కొద్ది రోజులు చర్చలు నడిచాయి.
కానీ ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం ప్రస్తుతం ఇండియా లో రాజమౌళి రేంజ్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఏకైక సెలబ్రిటీ ఒక్క ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రమే అని ‘పుష్ప 2’ తర్వాత తేల్చి చెప్తున్నారు. వాళ్ళ పరిశీలన ప్రకారం అల్లు అర్జున్ కి తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడు, కర్ణాటక, నార్త్ ఇండియా, కేరళ ఇలా ప్రతీ చోటా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, పుష్ప చిత్రం తర్వాత ఆ ఫాలోయింగ్ పదింతలు అయ్యిందని అంటున్నారు. కారణం పుష్ప చిత్రం హిట్ అవ్వడానికి కారణం డైరెక్టర్, కథ, స్క్రీన్ ప్లే కాదు, అల్లు అర్జున్ నటన. ఈ చిత్రంలో ఆయన చూపించిన యాటిట్యూడ్, చేసిన మ్యానరిజమ్స్ నేషనల్ వైడ్ గా చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు అనుసరించారు. గడిచిన దశాబ్ద కాలం లో ఒక క్యారక్టర్ ప్రభావం అన్ని వర్గాల ప్రేక్షకుల మీద పడడం ఈ సినిమా విషయంలోనే జరిగింది.
అందుకే అల్లు అర్జున్ కి నార్త్ ఇండియా లో, తమిళనాడు లో ఆ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇప్పుడు పుష్ప 2 చిత్రానికి వస్తున్న ప్రతీ పైసా మీద అల్లు అర్జున్ పేరు మాత్రమే రాసి ఉంటుంది. సీక్వెల్ క్రేజ్ అనడానికి కూడా లేదు. ఎందుకంటే ఆ సినిమాకి సీక్వెల్ తీస్తే స్థాయి రావడానికి కారణమే అల్లు అర్జున్. అందుకే ఇప్పుడు అల్లు అర్జున్ రాజమౌళి తర్వాత మన టాలీవుడ్ నుండి బిగ్గెస్ట్ బ్రాండ్ వేల్యూ ఉన్న సూపర్ స్టార్. నిజమైన పాన్ ఇండియన్ స్టార్ అని ట్రేడ్ పండితులు కొనియాడుతున్నారు. రాజమౌళి, అల్లు అర్జున్ వంటి రెండు ఐకానిక్ బ్రాండ్స్ కలిసి ఒక సినిమా చేస్తే హాలీవుడ్ రికార్డ్స్ తో పోటీ పడే రేంజ్ కి మన టాలీవుడ్ ఎదుగుతుందని బలమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు ట్రేడ్ పండితులు.