Hardik Pandya: అందరూ ఐపీఎల్ ఆడడంలో బిజీగా ఉన్నారు. ఇక అందులో భాగంగానే ముంబై ఇండియన్స్ టీం కొత్త కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యా కూడా వాళ్ళ టీం ని స్ట్రాంగ్ చేయడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొదటి మ్యాచ్ గుజరాత్ తో ఆడినప్పటికీ, వాళ్ల మీద భారీ పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది. నిజానికి ఆ మ్యాచ్ ముంబై గెలవాల్సింది. కానీ చివరి నిమిషంలో గుజరాత్ టైటాన్స్ బౌలర్లు వాళ్ళ ఆధిపత్యాన్ని చూపించడంతో ఆ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కు ఓటమి ఎదురయింది.
ఇక ఇది ఇలా ఉంటే గుజరాత్ టీం నుంచి ముంబై ఇండియన్స్ టీం కి వచ్చి కెప్టెన్ గా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్న పాండ్య మీద ముంబై ఇండియన్స్ అభిమానులు గాని, రోహిత్ శర్మ ఫాన్స్ గాని ఆయన మీద విపరీతమైన ట్రోల్స్ అయితే చేస్తున్నారు. ఇక గ్రౌండ్ లో మ్యాచ్ జరుగుతున్నప్పుడు కూడా ఆయన మీద బ్యాడ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఇక మొత్తానికైతే హార్దిక్ పాండ్యని ముంబై ఇండియన్స్ అభిమానులు ఎవరు కెప్టెన్ గా ఒప్పుకోవడం లేదు. ఇక దానికి తగ్గట్టుగానే మొదటి మ్యాచ్ లో రోహిత్ శర్మ ను పదేపదే ఆయన చేయాల్సిన ఫీల్డింగ్ పొజిషన్ ని మార్చడం అనేది చాలామంది అభిమానులను తీవ్రమైన నిరాశకు గురిచేసిందనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఈరోజు హైదరాబాద్ తో జరిగే మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ విజయం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది.
ఇక ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న ముంబై ఇండియన్స్ టీం ప్లేయర్స్ అందరూ తమ తమ ప్రాక్టీస్ లో బిజీగా ఉన్నారు. ఇక ఇలాంటి సమయంలోనే హైదరాబాద్ కి చెందిన పాండ్య అభిమాని ఒకరు ఆయన్ని కలిసి ఆయన కాళ్లు మొక్కాడు… ఇక తన చేతి మీద ఉన్న ఆయన టాటూ ను చూపించి తను అతనికి ఎంత వీరాభిమాని అనేది చెప్పకనే చెప్పాడు. ఇక మొత్తానికైతే హార్దిక్ పాండ్య ఆ అభిమానితో కాసేపు మాట్లాడి, అతనితో కొన్ని ఫోటోలు కూడా దిగాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. తనకోసం పడి చచ్చిపోయే అభిమానులను సంపాదించుకోవడంలో హార్దిక్ పాండ్య చాలా వరకు సక్సెస్ అయ్యాడు.
ఇక తన ఆట తీరు వల్లే ప్రేక్షకులు తనకి అభిమానులుగా మారుతున్నారు. అనే ఒక సత్యాన్ని మాత్రం ఆయన ఎప్పుడూ మర్చిపోకుండా ప్రతి మ్యాచ్ లో తనదైన రీతిలో అద్భుతమైన ఆట తీరును ప్రదర్శిస్తున్నాడు. ఇక ఇప్పుడు ముంబై ఇండియన్స్ టీమ్ కెప్టెన్ గా తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే వచ్చింది. ఈరోజు జరిగే మ్యాచ్ లో హైదరాబాద్ ను ఓడించి ముంబై ఇండియన్స్ టీమ్ కి మొదటి విజయాన్ని అందిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
A die hard Hardik Pandya fan meets his Idol and he touched his feet & also he has got Hardik's tattoo on his Hand at Hyderabad.
– This is beautiful..!!! ❤️ pic.twitter.com/iHcTxCn0KN
— CricketMAN2 (@ImTanujSingh) March 27, 2024