Hair Problems: వయసుతో సంబంధం లేకుండా జుట్టు తెల్లబడుతుంది. ప్రస్తుతం ఎవరి జట్టును చూసినా తెల్లగానే కనిపిస్తుంది. ఇలా జుట్టు రంగు మారడానికి అనేక కారణాలు ఉన్నాయట. అందులో పోషకార లోపం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, కాలుష్యం, లైఫ్ స్టైల్ వంటి అనేక రకాల కారణాలు ఉన్నాయి. అయితే ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తెల్లజుట్టు నుంచి బయటపడే అవకాశం ఉంది. మరి ఓ సారి అవేంటో తెలుసుకోండి.
రోజు వారి ఆహారంలో మార్పులు చేసుకోవాలి. పాలకూర రసం తాగడం వల్ల జుట్టు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. పోషకాలు కూడా బాగా అందుతాయి. జుట్టు రాలే సమస్య వెంటనే తగ్గుతుంది. అంతేకాదు జుట్టు తెల్లగా మారడం అనే సమస్యనే ఉండదట. ఇందులో ఐరన్, విటమిన్ ఎ, సి లు ఉంటాయి కాబట్టి మీ జుట్టు ఆరోగ్యం పదిలం అవుతుంది.
క్యారెట్ రసం, క్యారెట్ తినడం వల్ల కూడా జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో బీటా కెరోటిన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది విటమిన్ ఎ గా అవతరిస్తుంది. దీనివల్ల జుట్టు ఆరోగ్యం మాత్రమే కాదు చర్మ సౌందర్యం కూడా మీ సొంతం అవుతుంది. తరచూ ఉసిరి కాయ తినడం వల్ల కూడా జుట్టు రాలడం, తెల్లగా మారడం వంటివి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ ఉసిరి కాయ జుట్టు రూట్స్ ను స్ట్రాంగ్ గా ఉంచుతుంది.
అల్లం కూడా జుట్టు ఆరోగ్యాన్ని పదిలం చేస్తుంది. బీట్ రూట్ జ్యూస్ తాగినా కూడా జుట్టుకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. అంతేకాదు బలంగా మారి నల్లగా ఉంటుంది జుట్టు. పుదీనా రసంలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పుదీనాతో తయారు చేసిన సబ్బులు, షాంపూలు వాడటం వల్ల జుట్టు రాలడం, తెల్లబడటం నుంచి కాపాడుకోవచ్చు. కొబ్బరి నూనెను ప్రతి రోజు జుట్టుకు రాయడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. మరి తెలుసుకున్నారు కదా.. ఓ సారి ట్రై చేయండి. కానీ జాగ్రత్త సుమ.