Viral Video : చెన్నై, ముంబై జట్లు ఇప్పటివరకూ చెరి ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీలు దక్కించుకున్నాయి. వాస్తవానికి ఈ జట్లకు సామాజిక మాధ్యమాలలో విపరీతమైన ఫాలోవర్స్ ఉంటారు. కానీ ఈ రెండు జట్లను కాదని బెంగళూరు ఏకంగా 20 మిలియన్ ఫాలోవర్స్ తో సరి కొత్త రికార్డు సృష్టించింది. చెన్నై సూపర్ కింగ్స్ 18.6 మిలియన్ ఫాలోవర్స్ తో ఇప్పటివరకు నెంబర్ వన్ స్థానంలో ఉండగా.. ఆస్థానాన్ని బెంగళూరు దాటేసింది. వాస్తవానికి చెన్నై జట్టుకు ఈ స్థాయిలో ఫాలోయింగ్ ఉందంటే దానికి ప్రధాన కారణం ఆ జట్టు ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలవడం.. కానీ బెంగళూరు ఇంతవరకు ఒక్కసారి కూడా ట్రోఫీ అందుకోలేదు. అయినా కూడా ఆ జట్టు సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ముఖ్యంగా ఇన్ స్టా గ్రామ్ లో 20 మిలియన్ ఫాలోవర్స్ ను కలిగి ఉండి ఐపీఎల్ లో ఏ జట్టుకు కూడా సాధ్యం కాని రికార్డును.. బెంగళూరు సాధించింది. అంతేకాదు ఈసారి ఐపీఎల్ లో ప్లే ఆఫ్ దాకా వెళ్ళింది. మంగళవారం జరిగే మ్యాచ్లో లక్నోపై గనుక గెలిస్తే బెంగళూరు టాప్ -2 లోకి వెళ్ళిపోతుంది. అందువల్లే ఈ మ్యాచ్ పై అందరి దృష్టీ నెలకొంది.
Also Read : 11 సంవత్సరాల తర్వాత టాప్ -2 లోకి.. పంజాబ్ వెనుక ఉన్న ఇద్దరు కింగ్స్ వీరే!
బెంగళూరు జట్టు అభిమానులను అలరించడానికి రకరకాల ప్రయోగాలు చేస్తుంది. గత ఏ డాది అన్ బాక్స్ పేరుతో ఒక ఈవెంట్ నిర్వహించింది. ఆ ఈవెంట్ ను బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించింది. ఆ కార్యక్రమానికి దాదాపు వేలాదిమంది బెంగళూరు అభిమానులు హాజరయ్యారు. ఈసారి కూడా అంతకుమించి అనే రేంజ్ లో నిర్వహించింది. దానికి కూడా ప్రేక్షకులు భారీగా హాజరయ్యారు. ఇక బ్లింక్ ఇట్ అనే యాప్ తో జట్టుకట్టి.. పిల్లలకు ఒక పోటీ నిర్వహించింది. ఆ పోటీలో గెలిచిన వారికి తమ జట్టు ప్లేయర్లను కలిసే అవకాశం కల్పించింది. వారికి విలువైన బహుమతులు కూడా అందించింది. ఇక ఇప్పుడు బెంగళూరు అభిమానులు సంతకాలు చేసిన జెర్సీలను.. తమ జట్టు ఆటగాళ్లకు అందించింది యాజమాన్యం. బెంగళూరు జట్టు యాజమాన్యం, స్టార్ స్పోర్ట్స్ కలిసి ఈ కార్యక్రమం నిర్వహించాయి.
సాధారణంగా అభిమానులకు ఆటగాళ్లు ఆటోగ్రాఫ్ లు ఇస్తారు. అభిమానులు ఆటోగ్రాఫ్ లు చేసిన జెర్సీలను ఆటగాళ్లకు అందించింది బెంగళూరు యాజమాన్యం, స్టార్ స్పోర్ట్స్ బృందం. ఈ జెర్సీలను ప్రత్యేకమైన బాక్సులలో ప్యాక్ చేసి ఆటగాళ్లకు అందించింది. వాటిని చూసిన ఆటగాళ్లు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. వాటిని ఫ్రేమ్ కట్టించుకుని ఇంట్లో పెట్టుకుంటామని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియోను బెంగళూరు యాజమాన్యం తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసింది. మరోవైపు ప్రతి ఏడాది పర్యావరణంపై స్పృహ పెంచడానికి.. మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడానికి బెంగళూరు యాజమాన్యం తమ ఆటగాళ్లతో గ్రీన్ జెర్సీలను ధరింపజేస్తుంది. ఈసారి కూడా గ్రీన్ జెర్సీలను ధరింపజేసి పర్యావరణంపై తనకు ఉన్న స్పృహను బెంగళూరు యాజమాన్యం మరోసారి చాటుకుంది.
A BEAUTIFUL INITIATIVE BY RCB AND JIO STAR. ❤️ pic.twitter.com/9WMro84nLX
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 27, 2025