Pawan Kalyan : పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తో మంచిగా ఉన్నంత కాలం చాలా బాగా ఉంటుంది, తేడాలు వస్తే ఎంత కఠినంగా ఉంటాడో రీసెంట్ గా తెలుగు సినీ పరిశ్రమలో జరిగిన కొన్ని సంఘటనలు చూస్తే అర్థం అవుతుంది. తన ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) సినిమా విడుదలకు దగ్గర గా ఉన్న సమయంలో జూన్ 1 నుండి థియేటర్స్ బంద్ కి పిలుపుని ఇచ్చిన ఘటన ఆయన మనసుని చాలా బాధపెట్టింది. ఇండస్ట్రీ తో ఎంతో స్నేహం గా ఉంటూ, ఏది కోరితే అది ఇస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వం తో పోలిస్తే, కూటమి ప్రభుత్వం ఇండస్ట్రీ ఉన్నతికి ఎంతో మేలు చేయడానికి ప్రయత్నం చేసింది. ఈ తరుణం లో పలువురు సినీ నిర్మాతలు అత్యుత్సాహం కారణంగా పవన్ కళ్యాణ్ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నాడు. ఇక నుండి ప్రభుత్వం తో సినీ పెద్దలు వ్యక్తిగత చర్చలు చేయరాదని, కేవలం ఫిలిం ఛాంబర్ ద్వారా మాత్రమే సంప్రదింపులు జరపాలని ఆదేశించాడు.
Also Read : వన్ నేషన్-వన్ ఎలక్షన్ ఆచరణ సాధ్యమే: పవన్ కళ్యాణ్
నేడు కూడా ఈ విషయం పై ఆయన ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఒక లేఖని విడుదల చేశారు. ఇక నుండి సినిమా హాళ్ల నిర్వహణ చాలా పకడ్బందీగా ఉండాలి. థియేటర్స్ లో ఆహార పానీయాల నాణ్యతని పరిశీలించాలి, వాటి ధరలపై నియంత్రణ చర్యలు తీసుకోవాలి. ఇక నుండి నా సినిమా అయినా సరే టికెట్ ధరలు కావాలంటే ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలి. మా సినిమాటోగ్రఫీ శాఖ ఎప్పటికప్పుడు స్పందించి టికెట్ ధరలు అందిస్తుంది. అంతే కాకుండా సినిమా హాళ్ల బండ్ పిలుపు వెనుక ఉన్న శక్తులను గుర్తించాలి. దీని వెనుక జనసేన పార్టీ వాళ్ళ హస్తం ఉన్నా ఉపేక్షించేది లేదు అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. సినిమా థియేటర్స్ ని జూన్ 1 నుండి మూసివేయాలి అనే పిలుపు తూర్పు గోదావరి జిల్లా నుండి ముందుగా మొదలైంది. ఈ వ్యవహారం మొదలు పెట్టింది ఎవరో కాదు, జనసేన పార్టీ రాజమండ్రి ఇంచార్జ్ అత్తి సత్యనారాయణ అట.
రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో స్వయంగా అత్తి సత్యనారాయణ ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఇది పవన్ కళ్యాణ్ వరకు వెళ్లడం తో వెంటనే అతన్ని జనసేన నుండి సస్పెండ్ చేస్తూ, ఇందులో నిజా నిజాలేంటో తేల్చాలని ఆదేశించాడు. పవన్ కళ్యాణ్ ఇంత కఠినంగా ఉంటాడని ఎవ్వరూ ఊహించలేకపోయారు. నిన్న మొన్నటి వరకు ఇండస్ట్రీ కి ఏ చిన్న పని కావాలన్నా ఒక్క ఫోన్ కాల్ తో జరిగిపోయేది. కానీ ఇప్పుడు కేవలం కొంతమంది అత్యుత్సాహం కారణంగా ఇండస్ట్రీ మొత్తం రిస్క్ లో పడిపోయింది. పవన్ కళ్యాణ్ ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో ప్రస్తుతం లేడు. ఈ విషయం సర్దుకోవాలంటే స్వయంగా మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ చొరవ తీసుకోవాల్సిందే. చిరంజీవి చెప్పినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ వింటాడో లేదో అనే అనుమానం ఉంది. ఇంకా ఆయన ఎలాంటి ప్రకటనలు చేసాడో ఈ క్రింది ట్వీట్ లో చూడండి.
సినిమా హాళ్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలి
థియేటర్లలో ఆహార పానీయాల నాణ్యత, ధరలపై నియంత్రణకు చర్యలు
నా సినిమా అయినా సరే టికెట్ ధరల పెంపు కావాలంటే ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలి
రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తుంది
సినిమా హాళ్ల…— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) May 27, 2025