Telugu Film Industry : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా అల్టిమేట్ గా సక్సెస్ అనేది ఇక్కడ కీలకపాత్ర వహిస్తూ ఉంటుంది. ఇప్పుడున్న హీరోలు వరుస సక్సెస్ లను సాధించడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది స్టార్ డైరెక్టర్లు స్టార్ హీరోల కాంబినేషన్ లో రావాల్సిన సినిమాలు రావడం లేదంటూ వాళ్ళ అభిమానులు సైతం కొంతవరకు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక మొత్తానికైతే కొన్ని కాంబినేషన్స్ లో సినిమా వస్తే ఆ సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా ఇండస్ట్రీలోని రికార్డులు బ్రేక్ అవుతాయి అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తుండటం విశేషం…ఇంతకీ ఎవరి కాంబినేషన్ లో సినిమాలు వస్తే ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాయి అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
Also Read :
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పుష్ప 2 (Pushpa 2) సినిమాతో పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేసిన అల్లు అర్జున్ స్టార్ హీరోగా ఎదుగుతున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన రాజమౌళి (Rajamouli) డైరెక్షన్లో ఒక సినిమా కూడా చేయలేదు. వాళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులు బ్రేక్ అవుతాయంటూ చాలా మంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
రామ్ చరణ్ – ప్రశాంత్ కాంబినేషన్లో సినిమా వస్తే అది ఇండస్ట్రీ రికార్డులను సైతం తిరగరాయడమే కాకుండా వీళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేస్తాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
ప్రభాస్ – అట్లీ డైరెక్షన్లో సినిమా కోసం చాలామంది ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అట్లీ కమర్షియల్ ఎలిమెంట్స్ ని చాలా రిచ్ గా చూపిస్తూ ప్రేక్షకుల్లో ఎమోషన్ ని బిల్డ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రభాస్ అయితే ఆయనకు బాగా వర్కౌట్ అవుతుంది. మరి వీళ్ళ కాంబినేషన్లో సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి…
మహేష్ బాబు – సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో సినిమా పడితే అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది…వీళ్ళిద్దరికీ సపరేట్ స్టైల్ ఉంది. మరి ఎవరి స్టైల్ లోకి ఎవరు వచ్చి సినిమాలు చేస్తారు అనేది తెలియాల్సి ఉంది…
సుకుమార్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో సినిమా వస్తే అది అల్టిమేట్ విజయాన్ని అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న పలు రికార్డులు బ్రేక్ అవుతాయి. అలాగే అటు పవన్ కళ్యాణ్ కి, ఇటు సుకుమార్ కి వాళ్ళ కెరియర్ లోనే ది బెస్ట్ మూవీ గా నిలిచిపోయే సినిమా అవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
ఇక జూనియర్ ఎన్టీఆర్ – లోకేష్ కనకరాజు కాంబినేషన్లో సినిమా వస్తే మాత్రం టెక్నికల్ గా విజువల్ వండర్ ని క్రియేట్ చేయడమే కాకుండా ఎన్టీఆర్ కి ఒక సపరేట్ ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెడుతుంది…