https://oktelugu.com/

వైరల్: క్రికెట్ మ్యాచ్ మధ్యలో లవ్ ప్రపోజల్

  ఇంగ్లండ్-పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టీ20 సందర్భంగా మ్యాచ్ లో ఆసక్తికర ప్రేమ సన్నివేశం వీక్షకులకు ఆనందం పంచింది. ఈ సన్నివేశం వీక్షకులతోపాటు నెటిజన్లను ఆకట్టుకుంది. ఓవైపు మ్యాచ్ హోరాహోరీగా సాగుతున్న వేళ.. మధ్యలో ఓ వ్యక్తి తన లవర్ కు 22వేల మంది ముందు లవ్ ప్రపోజ్ చేశాడు. దీన్ని స్టేడియంలో టీవీ స్క్రీన్ పై చూపించారు. టీవీలోనూ కనిపించేలా చేశారు. అతడి ప్రేమను ఆ యువతి అంగీకరించింది. దీంతో వారిద్దరూ హద్దుకొని […]

Written By:
  • NARESH
  • , Updated On : July 22, 2021 / 09:33 AM IST
    Follow us on

     

    ఇంగ్లండ్-పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టీ20 సందర్భంగా మ్యాచ్ లో ఆసక్తికర ప్రేమ సన్నివేశం వీక్షకులకు ఆనందం పంచింది. ఈ సన్నివేశం వీక్షకులతోపాటు నెటిజన్లను ఆకట్టుకుంది.

    ఓవైపు మ్యాచ్ హోరాహోరీగా సాగుతున్న వేళ.. మధ్యలో ఓ వ్యక్తి తన లవర్ కు 22వేల మంది ముందు లవ్ ప్రపోజ్ చేశాడు. దీన్ని స్టేడియంలో టీవీ స్క్రీన్ పై చూపించారు. టీవీలోనూ కనిపించేలా చేశారు.

    అతడి ప్రేమను ఆ యువతి అంగీకరించింది. దీంతో వారిద్దరూ హద్దుకొని ముద్దులు పెట్టుకున్న సన్నివేశం హైలెట్ గా నిలిచింది. ప్రియుడు లవ్ ప్రపోజల్ చేయడంతో ఆ యువతి భావోద్వేగానికి గురై కంటతపడి పెట్టింది. అతడి ప్రేమకు అంగీకారం తెలిపింది. దీంతో అక్కడున్న ప్రేక్షకులు, కామెంటరీ వాళ్లు చప్పట్లతో మారుమోగించారు. వారిద్దరికీ చాలా మంది వచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

    ఈ అద్భుత సీన్ కు కామెంటేటర్ డేవిడ్ లాయిడ్ అద్భుతంగా కామెంట్రీ చేశాడు. ‘అతడు వచ్చాడు.. ప్రేమ వ్యక్తం చేశాడు.. ఆమె ఒప్పుకుంది.. ఓ ముద్దించ్చింది.. జిల్ ఫిల్ అంటూ’ హోరెత్తించాడు.

    మొత్తంగా ఇంగ్లండ్-పాకిస్తాన్ మూడో టీ20 సందర్భంగా స్టేడియంలో ఈ జంట ప్రేమ ప్రపోజల్ వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు పంచుకోవడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    https://twitter.com/englandcricket/status/1417786570757656579?s=20