జగన్ చేసిన పెద్ద తప్పు అదే..!

ఎలాంటి నిర్ణయాలనైనా చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకునే ఏపీ సీఎం జగన్ ఆ విషయంలో మాత్రం మెతక వైఖరి ప్రదర్శిస్తున్నారా..? తనకు వ్యతిరేకంగా మారిన వారిని ఏదో రకంగా కట్టడి చేస్తున్నా.. ఆయన విషయంలో మాత్రం చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారా..? ఓ వైపు ఆయన పార్టీపై ఎదురుదాడి దిగడంతో పాటు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. చర్యలు తీసుకునే అస్త్రం చేతిలోనే ఉంది. అయినా వెనుకడుగు వేయడానికి కారణాలేంటి..? జగన్ ఎందుకు ఆయన విషయంలో నాన్చుడి ధోరణిని […]

Written By: NARESH, Updated On : July 22, 2021 9:18 am
Follow us on

ఎలాంటి నిర్ణయాలనైనా చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకునే ఏపీ సీఎం జగన్ ఆ విషయంలో మాత్రం మెతక వైఖరి ప్రదర్శిస్తున్నారా..? తనకు వ్యతిరేకంగా మారిన వారిని ఏదో రకంగా కట్టడి చేస్తున్నా.. ఆయన విషయంలో మాత్రం చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారా..? ఓ వైపు ఆయన పార్టీపై ఎదురుదాడి దిగడంతో పాటు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. చర్యలు తీసుకునే అస్త్రం చేతిలోనే ఉంది. అయినా వెనుకడుగు వేయడానికి కారణాలేంటి..? జగన్ ఎందుకు ఆయన విషయంలో నాన్చుడి ధోరణిని ప్రదర్శిస్తున్నారు..? జగన్ ఆయనపై చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పుడు ఏకుకు మేకై కూర్చున్నారని పార్టీ నాయకులు అంటున్నారు..? నిజంగానే జగన్ తప్పు చేశారా..?

సొంత పార్టీపై ధిక్కార స్వరం వినిపిపంచి, ఆ తరువాత పూర్తి వ్యతిరేకతతో విమర్శలు చేస్తున్న ఎంపీ రఘురామకృష్ణ విషయం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన అరెస్టు వ్యవహారం నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తప్ప.. తీసుకుంటున్న చర్యలు ఏమీ లేవని పార్టీ నాయకులు అంటున్నారు. ఓ వైపు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే.. ప్రతిపక్షాల అండతో ఢిల్లీలో హల్ చల్ చేస్తున్న ఎంపీపై వేటు వేసే అధికారం జగన్ చేతిలో ఉండగా వెనుకడుగు ఎందుక వేస్తున్నారంటూ చర్చ సాగుతోంది.

ఇప్పటికే పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యాయి. ఇందులో రఘురామకృష్ణం రాజు వైసీపీలో ఉండి ప్రతిపక్షాల వాయిస్ వినిపిస్తున్నారు. దీంతో తోటి ఎంపీలు అయోమయానికి గురవుతున్నారు. ప్రతి రోజు టీడీపీకి వత్తాసు పలుకుతున్న టీడీపీ చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేకపోతోంది. పార్టీ పరంగానేకాకుండా వ్యక్తిగతంగా జగన్ కు ఇబ్బందులే ఎదురవుతున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లోనే కాకుండా మీడియా ముందుకు వచ్చి వైసీపీపై విమర్శలు చేయడంతో వైసీపీకి కొరకరాని కొయ్యగా మారింది.

అయితే ఇప్పుడున్న ఎంపీల్లో రఘురామను బహిష్కరించలేదేందుకు..? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆయనను ఎంపీ నుంచి బహిష్కరిస్తే తనను ఎవరూ పట్టించుకోరు కదా..? ఎంపీ గా ఉన్నానని అండతోనే ప్రతిపక్షాల అండతో ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారని అంటున్నారు. మరోవైపు ఎంపీ హోదాలోనే ఢిల్లీ పెద్దలను కలుస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతున్నారు. ఇప్పుడున్న ఎంపీల్లో ఆయనను బహిష్కరిస్తే ఒక సంఖ్యా తగ్గడం తప్ప ఇంకేమీ నష్టం లేదుకదా..? లేకపోతే రాను రాను మరీ ఆ ఎంపీతో పార్టీ మరీ ప్రమాదంలో పడే అవకాశం లేకపోలేదని కొందరు నాయకులు చర్చించుకుంటున్నారు.