Homeక్రీడలుVinesh poghat : గుడ్ న్యూస్ చెప్పిన వినేష్ పొగాట్.. నెట్టింట వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు..

Vinesh poghat : గుడ్ న్యూస్ చెప్పిన వినేష్ పొగాట్.. నెట్టింట వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు..

Vinesh poghat : గత సంవత్సరం పారిస్ వేదికగా ఒలింపిక్స్ జరిగిన విషయం తెలిసిందే. ఈ పోటీలలో రెజ్లింగ్ విభాగంలో మన దేశం నుంచి వినేష్ పోగాట్ పోటీ పడింది. తన ఎదుర్కొన్న అన్ని పోటీలలో విజయం సాధించింది. మరొక పోటీలో గనుక విజయం సాధిస్తే ఆమె గోల్డ్ మెడల్ అందుకునేది. అయితే అధిక బరువు వల్ల గోల్డ్ మెడల్ రేసు నుంచి ఆమె తప్పుకుంది. ఆ తర్వాత ఆమె ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. తన బరువు విషయంలో ఇంటర్నేషనల్ స్థాయిలో లాయర్లతో వాదించినప్పటికీ ఫలితం దక్కకుండా పోయింది. దీంతో ఆమె ఒట్టి చేతులతోనే దేశానికి రావాల్సి వచ్చింది. అధిక బరువు వల్ల మెడల్ కోల్పోయిన నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆమెను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి కష్టకాలంలో దేశం మొత్తం అండగా ఉంటుందని ఆమెకు భరోసా ఇచ్చారు. ఆ తర్వాత వినేష్ మన దేశానికి వచ్చారు. తను రెజ్లింగ్ ను ఆడలేనని.. అలసిపోయానని.. శక్తిని కూడతీసుకునే అవకాశం తనకు లేదని.. పేర్కొన్నారు. రెజ్లింగ్ కు శాశ్వత వీడ్కోలు పలుకుతున్నట్టు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అప్పట్లో ఆమె తీసుకుని నిర్ణయం సంచలనంగా మారింది. వినేష్ వ్యవహారం ఏకంగా పార్లమెంటును స్తంభింపజేసింది. వినేష్ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్యాయం చేశారని.. ఆయన వల్లే ఆమె అధిక బరువు సమస్యను ఎదుర్కోలేకపోయారని ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు సోషల్ మీడియాలో విమర్శించారు.

Also Read : ఖేల్ రత్న, అర్జున్ అవార్డు, ద్రోణాచార్య అవార్డుల మధ్య తేడా ఏమిటో తెలుసా ?

గుడ్ న్యూస్ చెప్పింది

రెజ్లింగ్ కు వీడ్కోలు పలికిన వినేష్.. కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఇటీవల హర్యానా రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో విజయం సాధించింది.. ప్రస్తుతం ప్రజా ప్రతినిధిగా ఆమె కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఆమె గర్భవతి అయింది. ఇదే విషయాన్ని తన భర్త సోమ్ వీర్ తో కలిసి చెప్పింది. దానికి సంబంధించిన ఫోటోలు తన సామాజిక మాధ్యమ వేదికలలో పంచుకుంది..” మా ప్రేమ జీవితంలో కొత్త అధ్యాయం కొనసాగుతుంది” అని వినేష్ ఇన్ స్టా గ్రామ్ లో రాస్కొచ్చింది.. ఈ నేపథ్యంలో ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.”నీ పోరాటం ముగిసిపోలేదు. నీ ఆశయ సాధన ఆగిపోలేదు. మాతృత్వాన్ని ఆస్వాదించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. ఇప్పుడు నీ కడుపులో ఒక బిడ్డ ఊపిరి తీసుకుంటున్నాడు. ఆ పసిపాప రేపటి నాడు భూమ్మీదకి వచ్చిన తర్వాత నీ ఆశయసాధనకు పునరంకితమవుతాడు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఇది చాలా గొప్ప విషయం. నీ ప్రయాణం మరోవైపు టర్న్ తీసుకున్నందుకు అభినందనలు” అంటూ వినేష్ కు ఆమె అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Also Read : ఈ ఏడాది రికార్డులు సృష్టించిన క్రీడాకారులు వీరే!

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version