Gorantla Madhav: మీ మీద పోలీస్ కేసు నమోదయింది.. విచారణకు రండి అని పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తే ఎవరికైనా భయం వేస్తుంది. ఎందుకంటే చాలామందికి పోలీసు విచారణ పై ఒక క్లారిటీ ఉండదు. పైగా పోలీస్ స్టేషన్ అంటే చాలామందికి ఒక రకమైన భయం ఉంటుంది. పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారో, ఒకవేళ పోలీస్ స్టేషన్ కు వెళ్లకపోతే ఎలాంటి ఇబ్బంది పెడతారో అనే భయం చాలామందిలో ఉంటుంది.
Also Read: చంద్రబాబు, దగ్గుబాటి కలయిక సామాన్యులకు గొప్ప పాఠం.. పార్టీల కార్యకర్తలకు గుణపాఠం..
పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తే చాలామంది వెంటనే విచారణకు హాజరవుతారు. పోలీస్ శాఖలో పనిచేసిన వారికి పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందో తెలుసు. విచారణ ఎలా ఉంటుందో కూడా తెలుసు. అయితే ఇప్పుడు మీరు చదవబోయే కథనంలో ఓ వ్యక్తి పోలీస్ శాఖలో పనిచేశాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు . ప్రజా ప్రతినిధిగా ఐదు సంవత్సరాల పాటు కొనసాగాడు. అయితే ఇప్పుడు ఆయన పోలీస్ విచారణ అని చెప్పగానే భయపడిపోతున్నారు. ఇలా భయపడిపోతున్న వ్యక్తి పేరు గోరంట్ల మాధవ్.
పనిచేసిన అనుభవం ఉంది
గోరంట్ల మాధవ్ కు గతంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయిలో పోలీస్ శాఖలో పనిచేశారు. మరి అలాంటి వ్యక్తి పోలీస్ విచారణ అని చెప్పగానే భయపడిపోతున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ గోరంట్ల మాధవ్ పై ఫిర్యాదు చేశారు. ఫోక్సో కేసుల్లో బాధితుల వివరాలను మాధవ్ బయటికి వెల్లడించారని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే దీనిని తీవ్రంగా పరిగణించిన ఏపీ పోలీసులు.. ఈ కేసు విషయంలో విచారణకు తమ ఎదుట హాజరు కావాలని సైబర్ క్రైమ్ పోలీసులు గోరంట్ల మాధవ్ కు నోటీసులు ఇచ్చారు. పోలీసులు ఇచ్చిన నోటీసుల ప్రకారం బుధవారం మాధవ్ విచారణకు హాజరు కావాల్సి ఉండేది. అయితే బుధవారం తనకు విచారణకు హాజరు కావడం సాధ్యం కాదని.. గురువారం మాత్రమే వస్తానని వర్తమానం పంపారు. దానికి పోలీసులు కూడా ఓకే అన్నారు. చెప్పినట్టుగానే గురువారం విజయవాడలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు గోరంట్ల మాధవ్ వచ్చారు. ఇక్కడ అనేక సినిమాటిక్ సంఘటనలు తోటి చేసుకున్నాయి. మాధవ్ విచారణకు పదిమంది లాయర్లను తీసుకొని వచ్చాడు. గతంలో మాధవ్ ఎంపీగా పనిచేయడం.. పోలీసుగా కూడా పని చేసిన అనుభవం ఉండడంతో.. ఆయన అభ్యర్థన మేరకు విచారణ సమయంలో ఒక లాయర్ ఉండడానికి పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. అయితే దీనికి ఎలాంటి సమాధానం చెప్పాలో తెలియక మాధవ్ అలా నిలబడిపోయారు. అయితే మాధవ్ తో వచ్చిన లాయర్ మాత్రం పోలీసులతో గొడవకు దిగారు. లాయర్లందరినీ లోపలికి అనుమతించాలని ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆ లాయర్ వ్యవహార శైలితో పోలీసులకు ఆగ్రహం పెరిగిపోయింది. ఒక లాయర్ కు మాత్రమే అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. అది కూడా అక్కర్లేదంటే ఆ లాయర్ ని కూడా వెనక్కి తీసుకెళ్లాలని హెచ్చరించారు. పదిమంది లాయర్లతో విచారణకు వస్తామని చెబితే ఎలా ఊరుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
నిబంధనలు తెలియవా?
పోలీసులు క్లారిటీ ఇవ్వడంతో చేసేది ఏమీ లేక గోరంట్ల మాధవ్ ఒకే ఒక్క లాయర్ ను తన వెంట వేసుకొని పోలీస్ విచారణకు హాజరయ్యారు. గోరంట్ల మాధవ్ కు పోలీస్ శాఖలో పని చేసిన అనుభవం ఉంది. ఎంపీగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. అలాంటి వ్యక్తికి పోలీస్ శాఖలో నిబంధనలు ఎలా ఉంటాయో తెలియదా? విచారణకు ఎంతమంది లాయర్లతో హాజరు కావాలో తెలియదా? ఫోక్సో కేసులో వివరాలు బయట పెట్టకూడదనే విషయం తెలియదా? ఇన్ని విషయాలు తెలిసిన వ్యక్తి.. చట్టంపై సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి ఇలా వ్యవహరించడం చర్చకు కారణమవుతోంది. మరి దీనిపై గోరంట్ల మాధవ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.
Also Read: ఆ సీనియర్ ఎమ్మెల్యే పై రాయలసీమ బిజెపి నేతల ఫిర్యాదు!