Sports Lookback 2024: మరికొన్ని రోజుల్లో 2024 ఏడాది పూర్తి కాబోతుంది. ఈ ఏడాది క్రీడాకారులు మర్చిపోలేని రికార్డులను సృష్టించారు. టీ20 పురుషుల వరల్డ్ కప్ నుంచి ఆఖరికి చెస్ ఛాంపియన్ వరకు కూడా క్రీడా రంగం దేశం గర్వించదగ్గేలా చేసింది. ఈ ఏడాది ఎందరో క్రీడాకారులు దేశ స్థాయిని పెంచారు. అయితే క్రీడా రంగంలో ఈ ఏడాది గుర్తుండిపోయే అవార్డులను తీసుకొచ్చారు. వాటిని దేశం ఎప్పటికీ మర్చిపోదు. టీ 20 నుంచి రికార్డుల వేట మొదలై అంతర్జాతీయ చెస్ ఛాంపియన్స్ వరకు మనోళ్లు రికార్డులు సృష్టించారు. ఎన్ని ఏళ్లు అయిన కూడా క్రీడారంగం గుర్తుండిపోయే విధంగా ఇండియాకి అవధుల్లేని ఆనందాన్ని తీసుకొచ్చారు. మరి ఈ ఏడాది ఆటగాళ్లు సాధించిన టాప్ క్రీడా విజయాలు ఏంటో మీకు తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.
టీ20 ప్రపంచ కప్
భారత పురుషుల జట్టు టీ20 ప్రపంచ కప్‌ను ఈ ఏడాది గెలిచింది. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ టీ20 ప్రపంచ కప్ భారత్ గెలవడంతో ఆనందానికి అవధుల్లేవు. ఒక పండుగలా నిర్వహించారు. సౌత్‌ఆఫ్రికాపై భారత్ విజయం సాధించింది. గతంలో 200లో మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో భారత్ మొదటి టీ20 ప్రపంచ కప్‌ను సాధించింది. మళ్లీ అప్పటి నుంచి ఇప్పటి వరకు సాధించలేదు. దీంతో భారత్ మొత్తం సంబురాలు జరుపుకున్నాయి.
ఒలింపిక్స్ రికార్డులు
యువ షూటర్ అయిన మను భాకర్ పారిస్ ఒలింపిక్స్‌లో తొలి పతకాన్ని దేశానికి తీసుకొచ్చింది. పారిస్ ఒలింపిక్స్‌లో పతకం సాధించిన మొదటి భారత్ షూటర్ కూడా మను భాకరే.
తొలి బంగారు పతకం
ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా రికార్డు సృష్టించారు. ఈ విభాగం నుంచి బంగారం పతకం సాధించిన మొదటి ఆటగాడుగా నీరజ్ నిలిచాడు.
అత్యంత తక్కువ వయస్సులోనే చెస్ ఛాంపియన్..
ప్రపంచంలోనే యంగెస్ట్ చెస్ ఛాంపియన్‌గా గుకేష్ దొమ్మిరాజు నిలిచాడు. గతంలో విశ్వనాథన్ ఆనంద్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచారు. మళ్లీ 12 ఏళ్ల తర్వాత గుకేష్ నిలిచాడు. 18 ఏళ్ల వయస్సులోనే చెస్ ఛాంపియన్స్ టైటిల్ కొట్టి రికార్డు సృష్టించాడు. చైనాకి చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించి గుకేష్ విజయం సాధించాడు. తన చిన్న నాటి కలను నిజం చేసుకుని యావత్తు ప్రపంచ భారత్ వైపు చూసేలా చేశాడు. కేవలం 12 ఏళ్లలో చెస్ గ్రాండ్ మాస్టర్ అయిన గుకేష్ వరల్డ్ యంగెస్ట్ చెస్ ఛాంపియన్ కావాలని చిన్నప్పటి నుంచే కలలు కన్నాడు. వాటిని ఈ ఏడాది సొంతం చేసుకున్నాడు.
అండర్-19
అండర్-19 మహిళల ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్‌గా విజయం సాధించింది. బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించి భారత్ గెలిచింది. మహిళల విభాగంలో టీ20 ఫార్మాట్‌లో మొదటిసారి ఈ టోర్నీ జరిగింది. ఇందులో భారత్ ఘన విజయం సాధించింది.