https://oktelugu.com/

Vinesh Phogat: కాస్ ఇన్ని రోజుల సమయం తీసుకుందంటే.. వినేశ్ విషయంలో ఏదో జరుగుతోంది..

సింఘానియా అనేక కేసులు వాదించారు. వాటిల్లో ఎక్కువ శాతం విజయాలు సాధించారు. వినేశ్ కేసులో చారిత్రాత్మకమైన తీర్పు వస్తుందని అందరూ భావిస్తున్నారు.. వాస్తవానికి వచ్చే తీర్పు వినేశ్ కు అనుకూలంగా రావాలనేది అత్యాశ అయినప్పటికీ.. ఆమెకు పతకం దక్కాలని భారతీయులు కోరుకుంటున్నారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 13, 2024 8:21 pm
    Vinesh Phogat(6)

    Vinesh Phogat(6)

    Follow us on

    Vinesh Phogat: పారిస్ లో ఒలింపిక్స్ ముగిసినప్పటికీ.. భారత మల్ల యోధురాలు వినేశ్ ఫొగాట్ వ్యవహారం ఇంకా సద్దుమణగలేదు. కుస్తీ పోటీల్లో 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందన్న కారణంతో పారిస్ ఒలంపిక్ కమిటీ ఫైనల్స్ లో ఆమెకు ఆడే అవకాశం ఇవ్వలేదు. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.. ఫైనల్ లో బరువు తగ్గడానికి వినేశ్ చేయని ప్రయత్నం అంటూ లేదు. జుట్టు కత్తిరించుకుంది. బాడీలో నుంచి బ్లడ్ తీసుకుంది.. రాత్రి మొత్తం జాగింగ్ చేసింది. చివరికి డైట్ కూడా మానేసింది. ఆయన కూడా 100 గ్రాముల బరువు తగ్గకపోవడంతో ఫైనల్స్ పోటీల్లో పాల్గొనలేకపోయింది. ఈ నేపథ్యంలో తనపై వేసిన అనర్హత వేటును ప్రశ్నిస్తూ రెజ్లర్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ( కాస్) లో ఆమె అప్పీల్ చేసింది.. ఆమె తరఫు వాదన విన్న కాస్.. ఇటీవలే తీర్పు చెప్పాల్సి ఉండేది..అయితే ఆ తీర్పును ఆగస్టు 13 కు వాయిదా వేసింది.. మరికొద్ది క్షణాల్లో ఆ తీర్పు వెలువడనుంది. ఒకవేళ తీర్పు అనుకూలంగా వస్తే వినేశ్ కు రజత పతకం వస్తుంది.

    ఏమన్నారంటే

    ఈ కేసులో వినేశ్ తరఫున ఇద్దరు సీనియర్ న్యాయవాదులు వాదించారు. ఇందులో విదుష్పత్ సింఘానియా అనే న్యాయవాది విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. కాస్ లో జరిగిన వాదనలను వివరించారు..” ప్రతి వాదనలో మాకు కష్టం ఎదురైంది.. తక్కువ సమయంలో మేము మా అభిప్రాయాలను సిద్ధం చేశాం. వాటిని కాసు ముందు ఉంచాం. మేము పడిన ప్రతి కష్టం వినేశ్ కోసమే.. నిబంధనల ప్రకారం కాస్ 24 గంటల్లో తీర్పు ఇస్తుంది. కానీ ఈసారి తీర్పు ఇచ్చే గడువును కాస్ చాలాసార్లు పొడిగించింది. ఈ పరిణామాలు భారత్ కు అనుకూలంగా ఉన్నాయని సంకేతాలు మాకు కనిపిస్తున్నాయి.. అడ్ హక్ ప్యానల్ కు తీర్పు ఇచ్చే కాల పరిమితి 24 గంటలు మాత్రమే. ఈ ప్రకారం తీర్పు ఇచ్చేందుకు ప్యానెల్ ఎంత తీవ్రంగా ఆలోచిస్తుందో అర్థం చేసుకోవచ్చు.. అయితే ఈ తీర్పు వెలువరించే వ్యక్తి మహిళ అయితే మాకు ఇంకా చాలా బాగుంటుందని” ఆయన పేర్కొన్నారు.

    సింఘానియా కెరీర్ లో విజయాలే ఎక్కువ

    సింఘానియా అనేక కేసులు వాదించారు. వాటిల్లో ఎక్కువ శాతం విజయాలు సాధించారు. వినేశ్ కేసులో చారిత్రాత్మకమైన తీర్పు వస్తుందని అందరూ భావిస్తున్నారు.. వాస్తవానికి వచ్చే తీర్పు వినేశ్ కు అనుకూలంగా రావాలనేది అత్యాశ అయినప్పటికీ.. ఆమెకు పతకం దక్కాలని భారతీయులు కోరుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆమెకు మెడల్ రాకపోయినప్పటికీ ఛాంపియన్ అని పేర్కొంటున్నారు. అయితే వినేశ్ ప్రస్తుతం పారిస్ స్పోర్ట్స్ విలేజ్ నుంచి బయటికి వచ్చారు. ఇంకా ఆమె స్వదేశానికి చేరుకోలేదు. త్వరలో ఆమె భారత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ తీర్పు ఆమెకు అనుకూలంగా వస్తే రజత పతకం సొంతమవుతుంది.