Brahmamudi: సెకండ్ హ్యాండ్ కళ్యాణ్ తో అప్పు పెళ్లి ఏంటి? బ్రహ్మముడిపై ట్రోల్స్ మామూలుగా లేవుగా..!

బిగ్ బాస్ సీజన్ తర్వాత మానస్ కి ఈ సీరియల్ పెద్ద బ్రేక్ ఇచ్చింది అనే చెప్పాలి. రాజ్, కావ్యాలు అనుకోకుండా కొన్ని కారణాల వల్ల పెళ్లి చేసుకుంటారు. రాజ్ ముందుగా కావ్య అక్క స్వప్న ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు.

Written By: Swathi, Updated On : ఆగస్ట్ 13, 2024 8:11 సా.

Brahmamudi

Follow us on

Brahmamudi: స్టార్ మా ఛానల్ లో ప్రస్తుతం టాప్ మోస్ట్ టీఆర్ఫీ రేటింగ్స్ తో కొనసాగుతున్న సీరియల్స్ లో ఒకటి ‘బ్రహ్మముడి’. బిగ్ బాస్ ఫేమ్ మానస్, దీపికా రంగనాథ్ హీరో హీరోయిన్లు గా ఈ సీరియల్ లో నటించారు. బిగ్ బాస్ సీజన్ తర్వాత మానస్ కి ఈ సీరియల్ పెద్ద బ్రేక్ ఇచ్చింది అనే చెప్పాలి. రాజ్, కావ్యాలు అనుకోకుండా కొన్ని కారణాల వల్ల పెళ్లి చేసుకుంటారు. రాజ్ ముందుగా కావ్య అక్క స్వప్న ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. పెద్దింటి అమ్మాయి లాగ రాజ్ కుటుంబానికి పరిచయమవుతుంది స్వప్న. అయితే కాసేపట్లో పెళ్లి అనగా, రాజ్ సోదరుడితో స్వప్న లేచిపోతుంది. అప్పుడు ఆమె తల్లితండ్రులు కావ్యకి ముసుగు వేసి స్వప్న స్థానం లో కూర్చోబెట్టి రాజ్ తో పెళ్లి చేసేస్తారు.

ఆ తర్వాత ఆమె జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు చూసే ఆడియన్స్ కి ఎంతో ఆసక్తిని కలుగచేస్తాయి. అయితే ఈ సీరియల్ లో రాజ్ – కావ్య ట్రాక్ తర్వాత కళ్యాణ్ – అప్పు లవ్ ట్రాక్ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. అప్పు ఎవరో కాదు కావ్య చెల్లెలు. బంధుత్వం కారణంగా వీళ్లిద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. అయితే ఆ క్రమం లో అప్పు కళ్యాణ్ ని ప్రేమిస్తుంది. కానీ ఈ విషయం కళ్యాణ్ కి చెప్పకుండా మనసులోనే బాధపడుతూ ఉంటుంది. ఇంతలోపే కళ్యాణ్ కి అనామిక అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఆమెతో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసేసుకుంటాడు. కానీ అనామిక కళ్యాణ్ ని పెళ్లి చేసుకోవడానికి ముఖ్య కారణం ఆస్తి కోసం. అందనంత పక్కన పెడితే అప్పు కళ్యాణ్ ని ప్రేమిస్తుంది అనే విషయం తెలుసుకొని, కళ్యాణ్ – అప్పు ని అనుమానిస్తూ టార్చర్ చేస్తూ ఉంటుంది. ఆమె టార్చర్ ని తట్టుకోలేక కళ్యాణ్ విడాకుల కోసం కోర్టుని ఆశ్రయించి, అనామిక చేసిన మోసాలన్నీ బయటకి పెడుతాడు. చివరికి ఆమెకి జైలు శిక్ష పడుతుంది, ఆమెతో కళ్యాణ్ కి విడాకులు కూడా మంజూరు అవుతుంది. అయితే ఇప్పుడు కళ్యాణ్ అప్పు ని పెద్దల సమక్షం లో పెళ్లి చేసుకుంటాడు. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే అప్పు క్యారక్టర్ ని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వారంతా ఇప్పుడు పెళ్ళైపోయి విడాకులు తీసుకున్న వ్యక్తితో పెళ్లేంటి.?, సమాజానికి దీని ద్వారా ఏమి చెప్పాలనుకుంటున్నారు?.

అసలు సీరియల్ లో అనామిక క్యారక్టర్ ని అనవసరంగా ఎందుకు తీసుకొచ్చారు..?, మొదట్లో ఆమెని మంచిగా చూపించి, కేవలం కళ్యాణ్ – అప్పు ని కలపడం కోసం అనామిక ని విలన్ గా చెయ్యాల్సిన అవసరం ఏంటి?, ముందుగానే కళ్యాణ్ లవ్ ట్రాక్ కొంతకాలం కొనసాగించి, ఆ తర్వాత ఎదో విధంగా పెళ్లి చేసేయొచ్చు కదా?, సీరియల్ లో హీరో హీరోయిన్స్ కంటే ఎక్కువగా ఇప్పుడు కళ్యాణ్ – అప్పు ట్రాక్ మీద ఫోకస్ పెడుతున్నారు, ఇదే ఈ సీరియల్ కి పెద్ద మైనస్ అవుతుంది, ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో టీఆర్ఫీ రేటింగ్స్ పూర్తిగా పడిపోయే ప్రమాదం ఉంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ హెచ్చరిస్తున్నారు.