Rishabh Pant : మంచానికి పరిమితమైన సమయంలో దాదాపు కొన్ని నెలలపాటు రిశబ్ పంత్ బ్రష్ కూడా చేసుకోలేదు. ఆ సమయంలో అతడు బతుకుతాడని కూడా అనుకోలేదు. వైద్యులు తీవ్రంగా శ్రమించడం.. అతడు కూడా బతికి సాధించాలని గట్టిగా అనుకోవడంతో కోలుకున్నాడు. మంచానికి మాత్రమే పరిమితమైన అతడు.. ఆ తర్వాత చేతిలో కర్ర సహాయంతో నడవడం మొదలుపెట్టాడు .. మెల్లి మెల్లిగా కుదురుకున్నాడు. అనంతరం మైదానంలోకి అడుగు పెట్టాడు. తీవ్రంగా సాధన చేశాడు. మొత్తంగా క్రికెట్ పై గ్రిప్ సాధించాడు .. ఐపీఎల్ 2024 సీజన్లో ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహించాడు. తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. జాతీయ జట్టులో మళ్లీ స్థానం సంపాదించాడు. టి20 వరల్డ్ కప్ లో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడి.. భారత జట్టు విజేతగా నిలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. అంతేకాదు న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్, ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లోనూ అద్భుతమైన ఆట తీరును ప్రదర్శిస్తున్నాడు .. అయితే తనకు రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు.. కాపాడిన వారిని రిషబ్ పంత్ మర్చిపోలేదు. అంతేకాదు వారికి అదిరిపోయే కానుకలు ఇచ్చి.. తన ఊదారతను చాటుకున్నాడు.
ఆపదలో ఆదుకున్న వారికోసం…
తను రోడ్డు ప్రమాదానికి గురై.. ప్రాణాపాయస్థితిలో ఉన్నప్పుడు రిషబ్ పంత్ ను కొంతమంది కాపాడారు. వారు అలా కాపాడటం వల్లే పంత్ ప్రాణాలతో ఉండగలిగాడు. అయితే తన ప్రాణాలు దక్కడం కోసం కృషిచేసిన వారికి రిషబ్ పంత్ అరుదైన కానుకలు ఇచ్చాడు. రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు కారు నుంచి బయటికి రాలేని పరిస్థితిలో.. ధైర్యం చేసి తనను బయటకు లాగిన రజత్, నిశు అనే యువకులకు పంత్ స్కూటీలను కానుకలుగా ఇచ్చాడు.. వారికి ఆ కానుకలు ఇచ్చి తన సహృదయతను చాటుకున్నాడు.. 2022 డిసెంబర్ 31న పంత్ తనకారులు ఇంటికి బయలుదేరాడు. అతని కారు ఢిల్లీ – డెహ్రాడూన్ మధ్యలో వెళ్తోంది. పంత్ మెర్సిడెజ్ కారు రూల్ కి సమీపంలోని హమ్మద్పూర్ ఝాల్ వద్దకు రాగానే రోడ్డు ప్రమాదం గురైంది. అత్యంత వేగంగా వెళుతున్న అతని కారు రోడ్డు రైలింగ్ ను ఢీ కొట్టింది. అంతే వేగంతో బోల్తా పడింది. కారు అలా బోల్తాపడటంతో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో పంత్ కారులోనే ఉన్నాడు. తీవ్రంగా గాయపడ్డాడు. కారు నుంచి విపరీతమైన మంటలు వస్తున్న నేపథ్యంలో రజత్, నిశు అనే యువకులు గమనించి.. కారు అద్దాలు బద్దలు కొట్టారు. పంత్ ను అమాంతం బయటకు లాగారు. ఆ తర్వాత అంబులెన్స్ కి ఫోన్ చేసి డెహ్రాడూన్ లోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. ఆ తర్వాత ముంబైలోని కోకిల బెన్ హాస్పిటల్ లో పంత్ తన మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. అనంతరం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్ళాడు. అక్కడ తన సామర్థ్యాన్ని పరీక్షించుకునే కసరత్తులు చేశాడు. అనతి కాలంలోనే పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని సాధించాడు. ఆ తర్వాత ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఇటువంటి వరల్డ్ కప్ లో ఆడాడు. బంగ్లాదేశ్ జట్టుతో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్లో అదరగొట్టాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా టూర్ లోనూ సత్తా చాటుతున్నాడు.
The two people who saved Rishabh Pant's life after his accident had no idea who he was.@beastieboy07 travels back to India to retrace the steps from Pant's accident to his return, but also much more than that.
The tale of Rishabh's recovery, from those closest to him pic.twitter.com/UuzaJBN0QT
— 7Cricket (@7Cricket) November 23, 2024