Site icon OkTelugu

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

Bajaj Pulsar

Bajaj Pulsar

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో ఉంటారు. ఇలాంటి వారికి బజాజ్ కంపెనీ సీజన్ రాకముందే పండుగ చేసుకునే బైక్ లను అందుబాటులోకి తీసుకురాబోతుంది. యూత్ తో పాటు ఎంప్లాయిస్ ఎక్కువగా లైక్ చేసే పల్సర్ వేరియంట్ లో చాలా వేరియంట్ లను తీసుకురాబోతుంది. అయితే వీటిలో రెండింటి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చని ఆటోమొబైల్ ప్రతినిధులు అంటున్నారు. వీటి పర్ఫామెన్స్ తో పాటు ఆకర్షణీయమైన డిజైన్ ను కలిగి ఉన్నాయని అంటున్నారు. ఇంతకీ వీటి స్పెషల్ ఏంటో చూద్దాం..

Bajaj నుంచి అతి త్వరలో పల్సర్ 125 సీసీ, 150 సీసీ సెగ్మెంట్లలో కొత్త మోడల్స్ రాబోతున్నాయి. ఇవి పూర్తిగా మారిపోతున్నాయి. వీటిలో ఇంజన్లతో పాటు నేటి తరం వారిని ఆకట్టుకునేవిధంగా డిజైన్ ను తయారు చేసినట్లు బజాజ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాకేష్ శర్మ ధ్రువీకరించారు. వీటిలో భాగంగా 125 మోడల్ ను ఇటీవలే రోడ్లపై టెస్టింగ్ చేశారు. దీంతో యూత్ తెగ ఇంప్రెస్ అవుతున్నారు.

బజాజ్ 125 సీసీ లేటెస్ట్ బైక్ లో 124.38 సీసీ ఇంజిన్ ఉండనుంది. ఇది 11.8 పీఎస్ పవర్ తో పాటు 10.8 ఎన్ ఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది. ఇందులో డిజిటల్ కనెక్టెట్ ఆప్షన్లు, అడ్జస్టబుల్ నైట్రోక్స్ రియర్ సస్సెన్షన్స్, ఎల్ ఈఢీ సెటప్, 240 ఫ్రంట్ డిస్క్ వంటి ఆప్షన్లు ఉండనున్నాయి. దీని వేరియంట్ ను భట్టి రూ. 79,939 నుంచి ప్రారంభం కానుంది. 150 సీసీ మోడల్ విషయానికొస్తే.. దీని ధర రూ.1,10,896 ఉండనుంది.

ఈ రెండు బైక్ లూ బడ్జెట్ లోనే అందుబాటులో ఉండనున్నాయి. అయితే నగరాల్లో ప్రయాణం చేసేవారికి 125 సీసీ ఉపయోగకరంగా ఉండనున్నాయి. మోడర్న్ లుక్ తో పాటు అడ్వాన్స్ ఫీచర్లు కావాలని అనుకునేవారు 150 సీసీ ఎంచుకోవడం మంచిది. అయితే వీటితో పాటు మరిన్ని మోడల్స్ అందుబాటులోకి రానున్నాయి. వినియోగదారుల డిమాండ్ కు తగిన విధంగా 7.2 నుంచి 9 మిలియన్ల యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేయనున్నట్లు కంపెనీ వర్గాలు తెలుపుతున్నాయి. అలాగే ఈవీ వేరియంట్ లోనూ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను తీసుకురానున్నారు.

Exit mobile version