Anand Mahindra : ఆనంద్ మహీంద్రా.. పేరుకు బడా కార్పొరేట్ అయినప్పటికీ.. వేల కోట్లకు అధిపతి అయినప్పటికీ.. లక్షాధిమందికి ఉపాధి కల్పిస్తున్నప్పటికీ.. ఎక్కడా ఆ తాలూకూ దర్పం కనిపించదు. ఊపిరి తీసుకోవడానికి కూడా క్షణం తీరికలేని ఆయనకు సోషల్ మీడియా అంటే ఇష్టం. జనాలతో కనెక్ట్ అయ్యేందుకు అది మంచి మార్గమని ఆనంద్ భావిస్తుంటారు. అందుకే అందులో బాగా యాక్టివ్ గా ఉంటారు. తనకు నచ్చిన సందేశాలు, తనకు నచ్చిన వ్యక్తులు, త్వరలో తీవ్రంగా ప్రభావితం చేసిన ప్రదేశాలు, బాధ పెట్టిన సంఘటన లు.. ఇలా ప్రతి ఒక్కటి ఆనంద్ మహీంద్రా షేర్ చేసుకుంటూ ఉంటారు. అంతేకాదు ఎవరైనా గొప్ప పనులు చేస్తే అభినందిస్తారు. వారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. అయితే అలాంటి ఆనంద్ మహీంద్రా ను ఆదివారం హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు ఓడిపోవడం ఇబ్బంది పెట్టింది. సెలవు రోజున ఆయనకి నిర్వేదాన్ని కలిగించింది. ఈ నేపథ్యంలో ఆయన తన మనసులోని నెటిజన్లతో పంచుకున్నారు.
ఒక పిల్లి నిర్వేదం, తీక్షణమైన చూపులతో అటు ఇటు తన కళ్ళను కదిలిస్తూ ఉంటుంది. మిగతా శరీర భాగాలను మొత్తం అలానే కదలకుండా ఉంచుతుంది. ఉప్పల్ లో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో భారత్ ఓడిపోవడం పట్ల ఆనంద్ మహీంద్రా తన స్పందనను ఇలా పంచుకున్నారు. ఇంగ్లాండ్ జట్టుతో భారత జట్టు ఓడిపోయిన నేపథ్యంలో ఇదీ నా స్పందన అంటూ ఆయన ఈ వీడియోను ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ వీడియో చర్చనీయాంశంగా మారింది. ట్విట్టర్ ఎక్స్ లో దాదాపు రెండు మిలియన్ల అనుచరులను ఆనంద్ మహీంద్రా కలిగి ఉన్నారు. ఆయన ఈ ట్వీట్ చేయడంతో చాలామంది వెంటనే రెస్పాండ్ అయ్యారు. వారు కూడా తమ తమ రీతుల్లో ఆనంద్ మహీంద్రా కు రిప్లై ఇచ్చారు.
ఇక ఉప్పల్ స్టేడియం లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ లో భారత్ దాదాపు 190 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. అయితే రెండవ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు బ్యాట్స్మెన్ తిరుగులేని ఆట తీరు ప్రదర్శించడంతో భారత్ ఎదుట 246 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు. మొత్తంగా ఉప్పల్ స్టేడియంలో రెండవ ఓటమిని మూట కట్టుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో భారత బ్యాట్స్మెన్ ఆట తీరు పట్ల విమర్శలు చెలరేగుతున్నాయి. ఇదే సమయంలో ఇంగ్లాండ్ ఆటగాళ్ల పై ప్రశంసలు కురుస్తున్నాయి.
That was my expression when learning about the result of today’s Test match…
pic.twitter.com/7atr7jH3MM— anand mahindra (@anandmahindra) January 28, 2024