ఆల్రెడీ 2025 -2027 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ మొదలైంది. ఇందులో ఇప్పటికే ఆస్ట్రేలియా మూడు టెస్టులు ఆడింది. శ్రీలంక రెండు టెస్టులు ఆడింది. టీమిండియా ఏకంగా ఆరు టెస్టులు ఆడింది. ఇందులో టీమిండియా మూడు విజయాలు సాధిస్తే.. రెండు ఓటములు.. ఒక డ్రా ద్వారా డబ్ల్యూటీసి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా తొలి స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా 3 టెస్టులు ఆడగా, మూడింటిలోనూ విజయం సాధించింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఖాతాలో 36 పాయింట్లు ఉన్నాయి. పాయింట్ పర్సంటేజ్ 100% గా ఉంది. ఇక శ్రీలంక రెండు మ్యాచ్లు ఆడగా ఒక దాంట్లో విజయం సాధించింది. మరొక మ్యాచ్ ను డ్రా చేసుకుంది. శ్రీలంక ఖాతాలో 16 పాయింట్లు ఉన్నాయి. పాయింట్ పర్సంటేజ్ 66.47 గా ఉంది. టీమిండియా ఆరు మ్యాచ్ లు ఆడగా.. ఇందులో మూడు విజయాలు సాధించింది. రెండు ఓటములు ఎదుర్కొంది. ఒక మ్యాచ్ డ్రా చేసుకుంది. టీ మీడియా ఖాతాలో 40 పాయింట్లు ఉన్నాయి. పాయింట్ పర్సంటేజ్ 55.56 గా ఉంది. వెస్టిండీస్ పై రెండో టెస్ట్ కూడా ఇన్నింగ్స్ తేడాతో టీమ్ ఇండియా విజయం సాధిస్తే అప్పుడు ర్యాంకులు మారే అవకాశం కనిపిస్తోంది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ ను ఐసీసీ ప్రవేశపెట్టిన తర్వాత తొలి రెండు సీజన్లలో టీమిండియా ఫైనల్ దాకా వెళ్ళింది. తొలిసారి న్యూజిలాండ్ చేతిలో.. రెండోసారి ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. మూడవసారి మాత్రం ఫైనల్ దాకా వెళ్లలేకపోయింది. మూడోసారి జరిగిన ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాను ఓడించి ట్రోఫీని అందుకుంది. అయితే ఈసారి ఎలాగైనా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లాలని టీమిండియా భావిస్తోంది. ఇందులో భాగంగానే అద్భుతమైన ఆట తీరు కొనసాగిస్తోంది. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ ను సమం చేసుకుంది. వెస్టిండీస్ జట్టుపై స్వదేశం వేదికగా జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్లో.. ఇప్పటికే తొలి మ్యాచ్లో ఘన విజయం సాధించింది. రెండో మ్యాచ్లో కూడా అదే స్థాయిలో గెలుపును దక్కించుకోవాలని ఉత్సాహంతో ఉంది.