Gautam Gambhir vs Rohit Sharma: రోహిత్ శర్మకు, గౌతమ్ గంభీర్ కు మొదటి నుంచి కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. అయితే అది అతడి కెరీయర్ నే ప్రశ్నార్థకంగా మారుస్తుందని ఎవరూ అనుకోలేదు. జట్టుకు కోచ్ గా వచ్చిన తర్వాత రోహిత్ శర్మనే గౌతమ్ గంభీర్ టార్గెట్ చేశాడు. అతని విజయాలను పట్టించుకోకుండా.. లోపాలను మాత్రమే ప్రధానంగా ప్రస్తావించాడు. అతని ఒత్తిడి తట్టుకోలేక రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ నుంచి పక్కకు తప్పుకున్నాడు. వాస్తవానికి టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకుంటాడని ఎవరూ ఊహించలేదు.
టెస్ట్ ఫార్మాట్ లో రోహిత్ శర్మకు గొప్ప రికార్డు లేకపోయినప్పటికీ.. అతని ఆధ్వర్యంలో టీమ్ ఇండియా ఒకసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ దాకా వెళ్ళింది. ఆ విషయాన్ని కూడా మర్చిపోయి గౌతమ్ గంభీర్ అతనిపై ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టాడు. ఆస్ట్రేలియా సిరీస్ లో రోహిత్ శర్మ సరిగ్గా ఆడకపోతే చివరి టెస్టుకు ఏకంగా జట్టు నుంచి తప్పించాడు. ఇక చాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టినప్పటికీ.. టీమిండియాను విజేతగా చేసినప్పటికీ.. దానిని గౌతమ్ గంభీర్ పెద్దగా లెక్కల్లోకి తీసుకోలేదు.. పైగా అతని లోపాలను ప్రధానంగా ప్రస్తావించి.. కెప్టెన్సీ నుంచి తొలగించాడు. దానికంటే ముందుగానే రోహిత్ శర్మతో బీసీసీఐ పెద్దలతో మీటింగ్ అరెంజ్ చేశాడు. ఆ మీటింగ్లో బీసీసీఐ పెద్దలు తమ ఉద్దేశాలను బయట పెట్టడంతో.. రోహిత్ తట్టుకోలేకపోయాడు. తన ఒంటరి పోరు వల్ల ప్రయోజనం ఉండదని భావించి.. కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. సాధారణ ఆటగాడిగా ఉంటానని పేర్కొన్నాడు. దీంతో మేనేజ్మెంట్ కొత్త సారధిగా గిల్ ను నియమించింది.
గిల్ నాయకత్వంలో అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా వన్డే సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్ లో టీమిండియా లో రోహిత్ సాధారణ ఆటగాడిగానే ఉంటాడు. అతనితోపాటు విరాట్ కోహ్లీ కూడా ఆడతాడు. మేనేజ్మెంట్ గిల్ కు సారధ్య బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో.. రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. పైగా సాధారణ ఆటగాడిగా కొనసాగుతానని రోహిత్ బోర్డు సభ్యుల ముందు ప్రకటించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
2027 వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని మేనేజ్మెంట్ ఈ నిర్ణయాన్ని ప్రకటించినట్టు సమాచారం.. మరోవైపు గిల్ ఆధ్వర్యంలో టీమిండియా ఇటీవల ఇంగ్లాండ్ దేశంలో పర్యటించింది. ఐదు టెస్టుల సిరీస్ ను సమం చేసింది. టెస్టులలో గిల్ తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. వన్డేలలో కూడా అతనికి బెస్ట్ రికార్డు ఉంది. టి20 లో విషయానికి వచ్చేసరికి అతడు విఫలమవుతున్నాడు. ఇటీవల ఆసియా కప్లో అతడు గొప్ప ఇన్నింగ్స్ ఆడ లేకపోయాడు.